తెలుగు సినిమాల్లో కథానాయిలపై కేవలం గ్లామర్ డాల్ అనే ముద్ర ఎప్పుడో పడిపోయింది. దాన్ని ఏ తరానికి ఆ తరం.. బలాన్ని తీసుకొచ్చే విషయంలో చమటోడ్చి మరీ గ్లామర్ ఒలికిస్తున్నారు. అయితే ఈమధ్య కథానాయికలు కొత్తగా `నటన + గ్లామర్` అనే సిద్ధాంతం ఫాలో అవుతున్నారు. దాంతో ఎంత గ్లామరెస్ పాత్ర అయినా.. కథానాయికలకూ ప్రాధాన్యం దక్కుతూ వస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ నుంచీ… తాను నమ్ముకొంది గ్లామర్‌నే. అయితే… ఒకటో రెండో సీన్లు నటించే స్కోప్ ఉండేలా చూసుకొనేది. ఎక్కువ శాతం.. రకుల్ పద్ధతైన స్కిన్ షోతో అలరిస్తూ వచ్చింది. తన తాజా చిత్రం `విన్నర్`లో అయితే.. ఆ గీత కాస్త దాటిందట. రకుల్ గ్లామర్ ఈ సినిమాలో ఓ రేంజ్లో చూపించారని, పాటల్లో, సన్నివేశాల్లో… రకుల్ ని కేవలం గ్లామర్ యాంగిల్లోనే ఆవిష్కరించారని తెలుస్తోంది. ఓ రెండు పాటల్లో అయితే.. వీరలెవిల్లో ఎక్స్పోజ్ చేసిందట. ధృవ లో పరేషానురా… పాటతో మెంటలెక్కించింది రకుల్. ఆ వెంటనే మరోసారి అలాంటి పాటలు రావడం.. అందులో యధావిధిగా రకుల్ రెచ్చిపోవడం.. కుర్రకారుకి పండగే.
అన్నట్టు సూయ సూయ సాంగ్ లో అనసూయ హాట్ షో కూడా అలరించేలానే ఉందట. హీరోయిన్ రకుల్ చిట్టి పొట్టి డ్రస్సులతో రెచ్చిపోతే.. ఐటెమ్ సాంగ్ చేసిన అనసూయ మాత్రం కాస్త పద్ధతిగానే కనిపించిందట. అయితే గ్లామర్ విషయంలో ఢోకా లేదని తెలుస్తోంది. మొత్తానికి విన్నర్లో సాయిధరమ్ తేజ్ హీరోయిజం కంటే.. హీరోయిన్ల గ్లామరిజమే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. మాస్‌ని ఆకట్టుకోవడానికి ఇదే సరైన అస్త్రం మరి.