మెగా కుటుంబంలో ఇంతమంది హీరోలు వచ్చారంటే, తాము కూడా నిలదొక్కుకుంటున్నారంటే, వాళ్లకంటూ ఓ అభిమానగణం ఉందంటే అదంతా చిరంజీవి చలవే. మెగా కుటుంబానికి ఆయనో మహావృక్షం. ఆయన రుణాన్ని… ఆ కుటుంబ హీరోలు ఏం చేసినా తీర్చుకోలేరు. కానీ సాయిధరమ్ తేజ్ మాత్రం తీర్చుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పుడుకాదు.. తాను హీరోగా అడుగుపెట్టిన తొలి రోజుల్లోనే.
సాయిధరమ్ తేజ్ ‘రేయ్’తో చిత్రసీమకు ఎంట్రీ ఇచ్చాడు. కానీ పారితోషికంగా కొంత మొత్తం అందుకున్నది మాత్రం ‘పిల్లా నువ్వులేని జీవితం’తోనే. ఆ సినిమాకి గానూ.. తాను అందుకున్న చెక్ని – చిరంజీవికి గురుదక్షణగా ఇచ్చాడట. ఈ విషయాన్ని తేజూనే చెప్పాడు. ”మేమంతా ఇలా ఉండడానికి కారణం చిరంజీవిగారే. ఆయన నాకు దేవుడు. దేవుడికి దక్షిణ ఇచ్చినట్టు నా తొలి పారితోషికాన్ని ఆయన పుట్టిన రోజు సందర్భంగా కానుకగా ఇచ్చా. అది చూసి.. ఆయన షాక్ తిన్నారు” అంటూ పాత రోజుల్ని ఓసారి గుర్తు చేసుకున్నాడు తేజూ.