సినిమా సినిమాకీ తన రేంజు పెంచుకొంటూ వెళ్తున్నాడు సాయిధరమ్ తేజ్. ఆ నమ్మకంతోనే సుప్రీమ్ సినిమాకి రూ.15 కోట్ల బడ్జెట్ పెట్టాడు దిల్‌రాజు. బయ్యర్లు కూడా అదే నమ్మకంతో ఈ సినిమాకి రూ.25 కోట్లకు కొన్నారు. గురువారం విడుదలైన సుప్రీమ్ యావరేజ్ టాక్ తెచ్చుకొన్నా… వసూళ్లు మాత్రం బాగున్నాయి. తొలిరోజు రూ.4.7 కోట్లతో సాయిధరమ్ తేజ్ కెరీర్లో ది బెస్ట్ గా నిలిచింది. రెండో రోజు మొత్తంగా రూ.3 కోట్ల వరకూ వసూలు చేసిందని టాక్. ఓవరాల్‌గా తొలి రెండు రోజుల్లో రూ.8 కోట్లు తెచ్చుకోవడంతో పాటు.. శని, ఆదివారాలూ మంచి వసూళ్లు వస్తాయన్న నమ్మకం ఉండడంతో సుప్రీమ్ సేప్ ప్రాజెక్టుగా నిలిచే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
శుక్రవారం విడుదలైన 24కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. సూర్య విజృంభణ కొనసాగే కొద్దీ.. సూప్రీమ్ డౌన్లో పడతాడు. అయితే బీసీల్లో సుప్రీమ్ స్ట్రాంగ్‌గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 20న బ్రహ్మోత్సవం వస్తోంది. అంత వరకూ పెద్ద సినిమాల తాకిడి ఏం ఉండదు. కాబట్టి… అటు 24, ఇటు.. సుప్రీమ్ రెండూ లాభపడే అవకాశాలున్నాయి.