తెలుగు సినిమాకి ఇంగ్లీష్ టైటిల్ ఇప్పుడు కొత్తేం కాదు. ఎప్పటి నుంచో వస్తున్న అలవాటే. కాకపోతే ఇప్పుడు మరీ.. ఎక్కువైపోయింది. తెలుగు భాషపై కొద్దో గొప్పో మమకారం ఉన్న ఏ దర్శకుడో పద్దతిగా తెలుగు టైటిల్ పెడితే ‘ఇంగ్లీష్‌లో పెడితే పోలా..’ అంటూ మార్చేస్తున్నారు హీరోలు. కొంతమందికి సెంటిమెంట్ పిచ్చి, ఇంకొంతమందికి ‘ఈజీగా క్యాచీగా ఉంటుంది కదా’ అనే గోల. మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా అంతే. సాయిధరమ్ తేజ్ – బివిఎస్ రవి కాంబినేషన్లో ఓ సినిమా పట్టాలెక్కబోతోంది. ఈ సినిమాకి కిసాన్ అనే టైటిల్ అనుకొన్నారు. అయితే.. సాయికి ఓ ఆలోచన వచ్చింది. ”జవాన్ అనే టైటిల్ మరీ ఓల్డ్ లుక్‌లో ఉంది. సోల్డర్ అని పెట్టేద్దాం బాగుంటుంది” అని దర్శక నిర్మాతల్ని కన్వెన్స్ చేశాడట. దాంతో వాళ్లూ సాయి మాట కాదనలేక ఈ సినిమాకి సోల్జర్ అనే టైటిలే ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
సుప్రీమ్, సుబ్రమణ్యం ఫర్ సేల్ రెండూ ఇంగ్లీష్ టైటిల్సే. అవి రెండూ హిట్టయ్యాయి కూడా. ఆ సెంటిమెంట్‌తోనే ఈ టైటిల్‌ని సాయిధరమ్ తేజ్ మార్చేశాడట. హీరోలు, దర్శకులు, నిర్మాతలూ ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే, సెంటిమెంట్‌కి పట్టం కడుతుంటే తెలుగు సినిమాల్లో తెలుగు టైటిళ్లు చూడాలనుకోవడం అత్యాసే అవుతుంది. కాదంటారా??