అవును.. రాశీఖన్నాకు మెగా హీరో సాయిధరమ్‌తేజ్ వార్నింగ్ ఇచ్చాడు. నవ్వావంటే చంపేస్తా.. అన్నాడు. అయితే అది సరదాకే లెండి. ఇండ్రస్ట్రీలో రాశీ – సాయి మధ్య ఓ స్ట్రాంగ్ ఫ్రెండ్ షిప్ నడుస్తోంది. ఇద్దరు కలసి సుప్రీమ్ లో నటించారు కదా. అప్పటి నుంచీ దోస్తీ కుదిరిందట. నాకు రాశీ మంచి ప్రెండ్ అని సాయి చెప్తుంటే.. సాయి కూడా రాశీ మై బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాడు. రాశీఖన్నాలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ ఏంటని అడిగితే.. ”రాశీ మాటిమాటికీ నవ్వుతుంటుంది. సుప్రీమ్ షూటింగ్ ఒకసారి రాత్రి మూడింటివరకూ జరిగింది. ఓ షాట్ ఎంతకీ అవ్వడం లేదు. ఎందుకంటే ఆ సీన్ లో రాశీ పడీ పడీ నవ్వుతోంది. దాంతో టేకులు పెరుగుతున్నాయి. నేను అప్పటికే అలసిపోయా. ఆ టైమ్‌లో సరదాగా రాశీకి వార్నింగ్ ఇవ్వాల్సివచ్చింది” అంటున్నాడు సాయి.
అలానే సాయి ధరమ్లోని ఓ బ్యాడ్ హ్యాబిట్ బయటపెట్టింది రాశీ ఖన్నా. సాయి ఎప్పుడూ ఫోన్లో చాటింగ్ చేస్తూ కూర్చుంటాడట. ఆ టైమ్‌లో చుట్టు పక్కల ఎవరున్నా సరే పట్టించుకోడట. ఈ విషయం సాయిధరమ్ వాళ్ల అమ్మ దగ్గరే కంప్లైంట్ చేసిందట రాశీ. అదీ మేటరు..!