‘దేవదాస్’ సినిమా వెనుక చాలా మంది రచయితల కృషి ఉంది. నిజానికి ఇది శ్రీరామ్ ఆదిత్య కథ కాదు. రాఘవ శ్రీరామ్ అనే రచయిత మూల కథ అందించాడు. దాన్ని భూపతి రాజా కథగా మలిచారు. సత్యానంద్ లాంటి సీనియర్ల హ్యాండు కూడా పడింది. ఆ తరవాతే దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య స్క్రీన్ ప్లే సమకూర్చుకున్నాడు. సంభాషణల విషయంలో బుర్రా సాయిమాధవ్ హ్యాండు కూడా తోడైంది. కొన్ని కీలక సన్నివేశాలకు ఆయన సంభాషణలు అందించారు. ఎమోషనల్ సీన్లు రాయడంలో బుర్రా స్పెషలిస్టు. పైగా ‘మహానటి’తో వైజయంతీ మూవీస్తో ఆయనకు అనుబంధం ఏర్పడింది. అందుకే… అశ్వనీదత్ అడగ్గానే… ‘దేవదాస్’ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలకు ఆయన సంభాషణలు అందించారు. ‘దేవదాస్’ టైటిల్ కార్డులో బుర్రా పేరు కూడా చూడొచ్చు. నాగార్జున, నాని కథానాయకులుగా నటించిన ఈ చిత్రం ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 26న హైదరాబాద్లో ఓ స్పెషల్ ప్రీమియర్ షో ఏర్పాటు చేస్తున్నారు. కొంతమంది టాలీవుడ్ సెలబ్రెటీతో పాటు మీడియాకు ఈ షో ప్రత్యేకం.