వెండితెరపై చలాకీ పాత్రల్లో యువతకు గిలిగింతలు పెడుతుంది బాన్సువాడ భానుమతి ఉరఫ్ సాయిపల్లవి. ఈ తమిళ సోయగానికి యువతరంలో మంచి ఫాలోయింగ్ ఉంది. వెండితెరపై అందం, అభినయంతో మెప్పించే ఈ అమ్మడు ఆఫ్‌ది స్క్రీన్‌లో మాత్రం ఎవరితో అంటీముట్టనట్లుగా ఉంటుందట. సహనటీనటుల్ని పెద్దగా పట్టించుకోదట. ఈ స్వభావమే తరచూ ఈ సొగసరిపై వివాదాలు రావడానికి కారణమవుతుందని చెబుతారు. తాజాగా శర్వానంద్‌తో ఈ అమ్మడికి గొడవలు తలెత్తాయని ఫిల్మ్ నగరలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరు కలిసి ప్రస్తుతం పడి పడి లేచె వయసు చిత్రంలో నటిస్తున్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. షూటింగ్ సమయంలో శర్వా, సాయిపల్లవి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయని అంటున్నారు. సాయిప్లలవి ఇగోయిస్టిక్ ప్రవర్తనతో శర్వా నొచ్చుకున్నాడట. చివరకు యూనిట్ సభ్యులు కన్విన్స్ చేయడంతో షూటింగ్‌ను కొనసాగించారట. గతంలో కూడా హీరో నాగశౌర్యతో సాయిపల్లవి గొవడ పడింతనే వార్తలు వినిపించాయి. సిల్వర్ స్ర్కీన్‌పై కుర్రకారుని మురిపించే సాయిపల్లవికి ఈ తలబిరుసు తనమెంటోనని సీనియర్ నటీలు ఆశ్చర్యపోతున్నారట.