సాయి పల్లవి రేంజుమారిపోయిందిప్పుడు. వరుసగా సినిమాలపై సినిమాలు ఒప్పేసుకుంటోంది. `వేదాళం`,` అయ్యప్పయుమ్ కోషియమ్ రీమేక్స్‌లో సాయి పల్లవి నటిస్తోంది. ఇవి కాక మరో రెండు సినిమాలు ఒప్పుకుంది. ఇప్పుడు గోపీచంద్ సినిమాలోనూ సాయి పల్లవి కోసమే ప్రయత్నిస్తున్నారు.
మారుతి దర్శకత్వంలో గోపీచంద్ కథానాయకుడిగా ఓ సినిమా ఫైనల్ అయిన సంగతి తెలిసిందే. యూవీ, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గురువారం అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పుడు హీరోయిన్ వేటలో పడిపోయారు. ఈ సినిమా కోసం సాయి పల్లవిని సంప్రదిస్తోంది టీమ్. `పక్కా కమర్షియల్ `అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇందులో గోపీచంద్ లాయర్ అని సమాచారం.