ఎప్పుడూ కూల్ గా వుండే సాయి పల్లవికి కోపమొచ్చింది. తనపై అసత్య కథనాలు ప్రచురిస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చచింది. ఇంతకీ జరిగిదంటే.. బాలీవుడ్ సినిమా ‘రామాయణ’లో సీత పాత్ర పోషిస్తోంది సాయి పల్లవి. ఈ సినిమా కోసం ఆమె చాలా నిష్టతో ఉంటున్నారని, చాలా అలవాట్లు మార్చుకున్నారని ఓ మీడియా సంస్థ ఊహాజనిత కథనం ప్రచురించింది.
ఈ సినిమా పూర్తయ్యేవరకు సాయి పల్లవి మాంసాహారం మానేశారని, బయట భోజనం తినడం లేదని, ఫారిన్ వెళ్లేటప్పుడు వంట వాళ్లను వెంట తీసుకెళ్తున్నారని.. ఇలా సాగిందా కథనం. ఈ కథనంపై సాయి పల్లవి తీవ్రంగా స్పందించింది. ఇలాంటి నిరాధారమైన రూమర్స్ రాస్తే ఎంత పెద్ద సంస్థ అయినా లీగల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
‘నాపై ఎన్ని రూమర్లు వచ్చినా ఇన్నాళ్ళు సైలంట్ గా వున్నాను. నిజాన్ని దేవుడికే వదిలేశాను. అయితే నా మౌనాన్ని అలుసుగా తీసుకొని ఇలాంటి రూమర్స్ తెగ రాసేస్తున్నారు. ఇప్పుడు రియాక్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది. నాకు సంబంధించి ఏవైనా నిరాధారమైన వార్తలు ప్రచురిస్తే.. చట్టబద్దమైన యాక్షన్ తీసుకుంటాను. ఇన్నాళ్లు సహించాను. ఇకపై ఈ చెత్తని సహించేది లేదు’ అని ఘాటుగా స్పందించారు సాయి పల్లవి.
బాలీవుడ్ నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ రామాయణాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా రణ్బీర్ నటిస్తుండగా.. సీతగా సాయిపల్లవి కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో వుంది.