సమంత, తమన్నా, శ్రుతిహాసన్, త్రిష.. ఇలా స్టార్లంతా వెబ్ సిరీస్ మాయలో పడిపోయారు. ఈ జాబితాలో ఇప్పుడు సాయిపల్లవి కూడా చేరింది. తమిళ దర్శకుడు వెట్రిమారన్ ఓ వెబ్ సిరీస్ ని రూపొందిస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి ప్రధాన పాత్రధారి. పరువు హత్యల నేపథ్యంలో సాగే కథ ఇది. తండ్రీ కూతుర్ల అనుబంధం ప్రధాన కథాంశం. తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపిస్తారు. స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ సెట్స్‌పైకి వెళ్లనుంది. పరిమిత బృందంతో.. ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించే సౌలభ్యం ఉందట. పైగా కథ బాగా నచ్చడంతో.. సాయి పల్లవి ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి ఒప్పుకుందని టాక్. ప్రస్తుతం `లవ్ స్టోరీ`లో కథానాయికగా నటిస్తోంది సాయిపల్లవి. మరో పది రోజులు కాల్షీట్లు కేటాయిస్తే చాలు. ఈ సినిమా పూర్తవుతుంది. `లవ్ స్టోరీ` కొత్త షెడ్యూల్ మొదలయ్యేలోగా… ఈ వెబ్ సిరీస్ పూర్తి చేయాలన్నది సాయిపల్లవి ప్లానింగ్.