హీరోలతో పాటు సరి సమానంగా క్రేజ్ సంపాదించుకొంది సాయి పల్లవి. తన పోస్టర్‌తో జనాల్ని థియేటర్లకు రప్పించొచ్చని దర్శక నిర్మాతలు నమ్ముతున్నారు. సాయి పల్లవి నుంచి ఓ సినిమా వస్తోందంటే ఎంతో కొంత అటెన్షన్ ఉంటుంది. అయితే `గార్గి` సినిమాకి అది కనిపించడం లేదు. సాయి పల్లవి నటించిన నాయికా ప్రాధాన్య చిత్రమిది. ఈ సినిమా మొత్తం సాయి పల్లవి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. శుక్రవారం ఈ చిత్రం విడుదల అవుతుంది. అయితే ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి ఎలాంటి సౌండూ వినిపించడం లేదు.కేవలం సాయి పల్లవి ఒక్కర్తే.. ప్రమోషన్లు చేసుకుంటుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం ఇప్పటి వరకూ జరగలేదు. పాటలూ బయటకు రాలేదు. ఒకే ఒక్క ట్రైలర్ వచ్చిందంతే. ఈ సినిమాని తమిళంలో సూర్య, తెలుగులో రానా విడుదల చేస్తున్నారు. వాళ్లు సైతం మీడియా ముందుకు రాలేదు. సాయి పల్లవి లాంటి స్టార్ హీరోయిన్ సినిమా ఇంత సైలెంట్ గా విడుదల చేస్తుండడం ఆశ్చర్యం అనిపిస్తోంది. బహుశా..`విరాటపర్వం` హిట్టయితే, `గార్గి`కి బజ్ వచ్చి ఉండేది. ఆ రకంగా.. విరాటపర్వం రిజల్ట్ ఈ సినిమా క్రేజ్‌పై దెబ్బ కొట్టింది. సినిమా విడుదలై…. చాలా బాగుందన్న టాక్ వస్తే తప్ప… జనం థియేటర్లకు కదలరు. మరి.. గార్గి ఏం చేస్తుందో..?