అడవిశేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `మేజర్`. శశి కిరణ్ తిక్క దర్శకుడు. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం సాయి మంజ్రేకర్ని ఎంచుకున్నారు. `దబాంగ్ 3`లో సల్మాన్ పక్కన జోడీ కట్టింది ఈ భామ. గ్లామర్ పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. అప్పటి నుంచీ మంజ్రేకర్ని తెలుగులోకి తీసుకురావాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. ఐటెమ్ సాంగుల కోసం కూడా మంజ్రేకర్ చుట్టూ తిరిగారు. చివరికి `మేజర్`లో కీలకమైన పాత్రకు ఓకే అయ్యింది. సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కిస్తున్న కథ ఇది. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో మహేష్ బాబు కూడా భాగం పంచుకోవడం తెలిసిన సంగతే. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. 2021 వేసవిలో ఈచిత్రాన్ని విడుదల చేస్తారు.