సినిమా సినిమాకు హీరోల మార్కెట్ పెరుగుతోంది. హీరోల ట్రాక్ రికార్డు చూడకుండా, డైరక్టర్ల కాంబినేషన్ ను బయ్యర్లు నమ్ముతున్నారు. అందుకే హీరో గత సినిమాల కన్నా ఎక్కువ పెడుతున్నారు. హీరో నాగ్ చైతన్య వ్యవహారం కూడా అలాగే వుంది. ఇప్పటి దాకా ఆంధ్రలో పది కోట్లు దాటి వసూలు చేసిన సినిమాలు ఒకటీ అరానే వున్నాయి. మనం సినిమా వాటిలో ఒకటి. ప్రేమమ్ సినిమా 8 కోట్ల రేంజ్ కే వెళ్లింది. అయితే ఇప్పుడు శైలజరెడ్డి అల్లుడు సినిమాను మాత్రం ఆంధ్రలో 10 కోట్ల రేంజ్ లో అమ్మేసారు.
ఇప్పటికే ఓవర్ సీస్ ను 3.15 కోట్లకు ఇచ్చారు. నాగ్ చైతన్యకు అదే రికార్డు అనుకుంటే, ఆంధ్రలో శైలజరెడ్డి అల్లుడు సినిమాను 10 కోట్ల రేంజ్ లో ఇవ్వడం విశేషమే. విశాఖ ఏరియాను గంటా శ్రీనివాసరావు అల్లుడు ప్రశాంత్ తదితరులు, ఈస్ట్ ను వి 3 సంస్థ, నెల్లూరు భాస్కర రెడ్డి, వెస్ట్ ఎల్ విఆర్ తీసుకున్నారు. మిగిలిన ఏరియాలు హారిక వారి రెగ్యులర్ బయ్యర్లు తీసుకున్నారు.
ఇప్పుడు ఆంధ్రలో శైలజరెడ్డి అల్లుడు సినిమా కనీసం 13 కోట్ల రేషియోలో వసూళ్లు సాగించాల్సి వుంటుంది. అలా వస్తేనే కనీసం ఖర్చులు కిట్టుబాటు అవుతాయి. నాగ్ చైతన్య రీసెంట్ పెద్ద హిట్ రారండోయ్ వేడుక చూద్దాం ఆంధ్రలో 12 కోట్ల లోపు వరకే వచ్చి ఆగిపోయింది. అంటే శైలజరెడ్డి అల్లుడు, ఆ సినిమా కన్నా పెద్ద హిట్ కావాల్సి వుంటుంది