నాగచైతన్య చేతిలో రెండు సినిమాలున్నాయిప్పుడు. సవ్యసాచి, శైలజారెడ్డి అల్లుడు.. రెండూ చివరి దశలో ఉన్నాయి. వీటిలో ఏ సినిమా ముందొస్తుందో కాస్త కన్ప్యూజన్ ఉండేది. ఇప్పుడు ఆ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు శైలజా రెడ్డి అల్లుడునే విడుదల కానుంది. ఆ తరవాతే సవ్యసాచి వస్తుంది. సో… శైలజారెడ్డి అల్లుడు ప్రమోషన్స్ కూడా మొదలెట్టాలని చిత్రబృందం భావిస్తోంది. ఇప్పటివరకూ ఫస్ట్ లుక్ మాత్రమే విడుదలైంది. ఇప్పుడు టీజర్‌ని సిద్ధం చేస్తోంది చిత్రబృందం. ఇప్పటికే టీజర్‌ని కట్ చేసి పెట్టింది. ముఫ్ఫై సెకన్ల పాటు సాగే ఈ టీజర్‌ని కూల్ అండ్ నీట్ గా తీర్చిదిద్దినట్టు సమాచారం. చైతూ, రమ్యకృష్ణ, అను ఇమ్మానియేల్‌ల పాత్రల్ని లైట్‌గా పరిచయం చేసే ప్రయత్నం చేశారిందులో. ఇదో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే విషయాన్ని టీజర్లో చెప్పే ప్రయత్నం చేసినట్టు సమాచారం. ఆగస్టు 31న సినిమాని విడుదల చేసే సన్నాహాల్లో ఉంది చిత్రబృందం. ఓ పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ఆపాటని గోవాలోగానీ, హైదరాబాద్‌లోగానీ చిత్రీకరించాలని భావిస్తున్నారు.