సూరీడు సెలవు తీసుకున్నాక సెట్స్‌కి వస్తున్నారు రెడ్డిగారి అల్లుడు అండ్ కో! అదేనండీ… ‘శైలజారెడ్డిగారి అల్లుడు’ టీమ్! అక్కినేని నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నైట్ షెడ్యూల్ ఇంకా పూర్తి కాలేదు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో నైట్ టైమ్ ఈ సినిమా షూటింగు చేస్తున్నారు. ప్రస్తుతం చైతూ, అనూ, ఇతర ప్రధాన తారాగణంపై ఫ్యామిలీ నేపథ్యంలో వచ్చే పాటను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ ‘శేఖర్ మాస్టర్’ ఈ పాటకు నృత్యరీతులు సమకూరుస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ఈ పాట పూర్తవుతుందని సమాచారం. తర్వాత కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తార్ట! ఈ సినిమాతో పాటు చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ షూటింగును కూడా చైతూ చేస్తున్నాడు. నెలలో 30 రోజులను రెండు సినిమాలకు సర్దుబాటు చేస్తున్నాడు. అందువల్ల, షూటింగులు కాస్త ఆలస్యమవుతున్నాయట.