సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఎవరికీ తెలియదని అందరికీ తెలిసిపోయేలా కుట్రలు చేసి అడ్డంగా ఇరుక్కుపోయే .. జగన్ రెడ్డిని రోడ్డున పడేసే కుట్ర సిద్దాంత నిపుణుడు. సోషల్ మీడియా అరెస్టుల నుంచి ఆయన చేసిన ప్రతి పిచ్చి పని రివర్స్ అయింది. మా నాన్న పెద్ద ప్లానర్ అని సజ్జల ఫీలయ్యాడేమో కానీ నేను ఏమైనా తక్కువ తిన్నానా అని ఆయన కూడా ఓ డ్రామా ఆడి అంతే అడ్డంగా దొరికిపోయాడు. ఈ వ్యవహారం ఇప్పుడు వాళ్ల ముఖం మీద వైసీపీ క్యాడర్ అంతా నవ్వేలా చేస్తోంది.
సోషల్మీడియా కేసుల్లో అరెస్టు చేస్తారని చెప్పి కుమార సజ్జల ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటీవల అంబటి రాంబాబును పోలీసుల వద్దకు పంపించి సజ్జల ఓ ఫిర్యాదు చేయించారు. సజ్జల భార్గవరెడ్డి డ్రైవర్ ను పోలీసులు తీసుకెళ్లి కొట్టారని.. అన్ని వివరాలు తెలుసుకుని మళ్లీ వదిలి పెట్టారనిఆ ఫిర్యాదు సారాంశం. కృష్ణా జిల్లా కమిషనర్ ఇందులో నిజానిజాలు తేల్చాలని పోలీసుల్ని ఆదేశించారు. పోలీసులు మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్లతో సహా తేల్చి ఆ సజ్జల డ్రైవర్ అనే వ్యక్తి ఆ సమయంలో ఏమేం చేశారో పోలీసుల ముందు పెట్టారు. దీంతో సజ్జల భార్గవ్ చేసిన పిచ్చి ప్లాన్ బయటపడింది.
కోర్టులో వాదించేందుకు తన డ్రైవర్లను వేధిస్తున్నారని చెప్పేందుకు ఈ నాటకం ఆడారు. పోలీసులపైనే ఆరోపణలు చేయడంతో మొత్తం బయటకు తీసి పోలీసులు కోర్టు ముందు పెట్టనున్నారు. ఇప్పుడు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు మాత్రమే కాదు.. సజ్జల భార్గవరెడ్డి కూడా మరింతగా ఇరుక్కున్నారు. అయినా ఇలాంటి పిచ్చి పిచ్చి ఐడియాతో రాజకీయాలు చేయాలని వీళ్లకు ఎలా అనిపిస్తుందో కానీ.. వీళ్లను చూసి నవ్వుకోవడానికి కూడా వైసీపీ కార్యకర్తలకు ఓపిక ఉండటం లేదు.