వైసీపీ క్యాంప్‌లో ముసలం ప్రారంభమయింది. ఘోర ఓటమిపై కారణాలను విశ్లేషించుకోకుండా ఈవీఎంలు అంటూ ఆరోపణలు చేస్తూ టైం పాస్ చేసుకుంటున్నారు. జగన్ ను తప్పుదోవ పట్టించిన సజ్జల వర్గం కూడా అదే ప్రచారం చేస్తోంది. అయితే ఇతరులు మాత్రం. చేసింది మొత్తం చేసి ఇంకా జగన్ ను భ్రష్టుపట్టిస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇప్పటి వరకూ అంతర్గతంగా ఉన్న ఈ అంశం ఇప్పుడు బహిరంగమయింది. సోషల్ మీడియాకు ఎక్కింది.
ఎలాన్ మస్క్ ఈవీఎంలను నమ్మలేమని చేసిన ప్రకటనను పట్టుకుని ఆజ్ఞాతంలో ఉన్న సజ్జల భార్గవ ట్వీట్ పెట్టారు. ఆయన అన్నాడు కాబట్టి ఇక్కడ కూడా అలాగే జరిగిందని వాదిస్తూ పోస్టుపెట్టారు. దీనిపై వెంటనే సలహాదారుగా ఉన్న రాజీవ్ కృష్ణ స్పందించారు. సజ్జల భార్గవకు కౌంటర్ ఇచ్చారు. ఈవీఎంలపై ఆరోపణలపు చేయడం ఆపాలని.. ఎన్నికలు సక్రమంగా జరిగాయని రాజీవ్ కృష్ణ స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాల వల్ల భారత్ లోనే కాదు అంతర్జాతీయంగా భారత ఎన్నికల ప్రక్రియపై తప్పుడు సంకేతాలు పంపుతున్నారని మండిపడ్డారు. ప్రజాతీర్పు గౌరవించాలన్నారు. దీనికి సజ్జల భార్గవ వివరణ ఇచ్చారు. ఈవీఎంలపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోందని.. తాను తన అభిప్రాయాన్ని చెప్పానని చెప్పుకొచ్చారు.
వైసీపీలోనే తమ ఓటమికి కారణంగా ఈవీఎంలను నిందించడానికి రెడీ అయిపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ అంశంపై పార్టీలో చర్చ జరగకపోగా.. ఓటమికి బాధ్యత తీసుకునేందుకు జగనమోహన్ రెడ్డి సిద్ధంగా లేరు. తాము బలికావడానికి సజ్జల, ఆయన కుమారుడు రెడీగా లేరు. అందుకే ఈవీఎం నెరేషన్ తెరపైకి తెచ్చి… నవ్వుల పాలవుతున్నారు.
https://x.com/SajjalaBhargava/status/1802532733010452674