ఐఎస్బీలో చదువుకున్న సజ్జల భార్గవకు ఇంత చీప్ .. బజారు ఐడియాలు వస్తాయా అని.. సోషల్ మీడియా అంతా అసహ్యంగా చూస్తోంది. వైసీపీ సోషల్ మీడియా తమ ప్రభుత్వ గురించి ప్రచారం చేయడానికి ఏమీ లేకపోయింది. దీంతో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసే వారిని.. మాట్లాడేవారిని వేధించాలని నిర్ణయించుకుంది. గత వారం రోజులుగా అదే టాస్క్. సీఐడీ కేసులు పెట్టి పెట్టి అసలిపోయారు కానీ.. .. ప్రభుత్వ వ్యతిరేక సోషల్ మీడియా సైన్యానికి మాత్రం ఊపొచ్చింది. ఎన్నికలకు ముందు వారు జగన్ సర్కార్ తీరుపై విరుచుకుపడుతున్నారు
దీంతో వారిని సైలెంట్ చేయాలంటే.. బూతులు, వేధింపుల యుద్ధం ఒకటే కరెక్ట్ అనుకున్నారు. వారందరి వివరాలు సీఐడీ దగ్గర ఉన్నాయి. అవన్నీ వైసీపీ సోషల్ మీడియాకు చేరాయి. లేని కొంత మందివి సమీకరించారు. అంతే..గత వారం రోజులుగా రెండు వందల మంది సోషల్ మీడియా కార్యకర్తలది అదే పని. మహిళా సోషల్ మీడియా కార్యకర్తల ఫోటోలను మార్ఫ్ చేయడం.. వారి క్యారెక్టర్లపై నిందలేయడం..
వీరు చేసిన మార్ఫింగ్లుక లండన్ లో ఉండే స్వాతిరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. రాజమండ్రిలో ఉండే ఉండవల్లి అనూష తన క్యారెక్టర్ కించపరిచేలా వాట్సాప్ చాట్లపేరుతో చేస్తున్న ప్రచారాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మణిరత్నం అనే యువకుడు తన వివరాల్ని సీఐడీ పోలీసులు వైసీపీ సోషల్ మీడియాకు ఇచ్చారని.. వారు ఫోన్లు చేసి టార్చర్ చేస్తున్నారని సోషల్ మీడియాలో పెట్టారు. ఇలా టీడీపీ తరపున యాక్టివ్ గా ఉండే అందర్నీ వేధించడం టాస్క్ గా పెట్టుకున్నారు.
అయితే రాజకీయాలను రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఇలా వేధించడం ఏమిటన్న ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి. ఇవాళ మీరు వేధిస్తారు.. రేపు ప్రభుత్వం మారితే… మీ కుటుంబాల్లోని ఆడవాళ్లు కూడా ఇలాగే అల్లరవుతారనే సంగతిని ఎలా మర్చిపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా సోషల్ మీడియాను ఊహించనంత స్థాయికి దిగజార్చేస్తున్నారు సజ్జల భార్గవ. ఆయన చదువుకున్న చదువుకు.. చేస్తున్నపనులకు తేడా లేదని అసహ్యం వ్యక్తం అవుతోంది సోషల్ మీడియాలో.