జగన్ రెడ్డి బహిరంగసభల్లో చంద్రబాబుపై ఏడ్చే ఏడుపులకు.. అదనంగా ప్రెస్మీట్లలో సజ్జల ఘోష జత కలుస్తోంది. కోర్టుల్లో చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై విచారణ జరుగుతున్నప్పుడే ప్రెస్ మీట్లు పెట్టే ఆయన చంద్రబాబుపై తమకు మాత్రమే సాధ్యమైన లాజిక్కులతో ఏడ్చేస్తూ ఉంటారు. చంద్రబాబు మెడికల్ టెస్టుల రిపోర్టులను లాయర్లు హైకోర్టుకు సమర్పించారు. ఈ రిపోర్టుల్లో చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో అనారోగ్య సమస్యలు వచ్చాయని గుర్తించారు. గుండె సైజ్ కూడా పెరిగిందన్నారు. ఆయన పర్యటనలకు వెళ్తే ఖచ్చితంగా అంబు్లెన్స్ ఉండాలన్నారు.
అయితే ఈ సిఫార్సులు చూసి సజ్జల రామకృష్ణారెడ్డికి ఏదో అనిపించింది. డాక్టర్లు ఇలా సిఫారసు చేస్తారా అంటే రాజకీయ పర్యటనలకు వెళ్లాలని రాసినట్లే కదా అంటున్నారు. డాక్టర్ రిపోర్టులో ఆయనకు అందుబాటులో అంబులెన్స్ ఉండాలన్నారు కానీ.. పర్యటనలకు వెళ్లమని రాయలేదు. కానీ సజ్జల రెడ్డి భయం .. సజ్జల రెడ్డిది. చంద్రబాబు జనంలోకి వెళ్తున్న సమయంలో ఆయనను అరెస్టు చేశారు. రెండు నెలల పాటు రాజకీయ కార్యకలాపాలకు దూరం చేశారు. ఇప్పుడ మళ్లీ ఎక్కడ తిరుగుతారోనని భయపడుతున్నారు. అందుకే.. ప్రెస్ మీట్ లలో తన బాధంతా వెళ్లగక్కుతున్నారు. పైకి మాత్రం.. చంద్రబాబు ప్రజాజీవితంలోకి రావాలని ఆయన లోపు ఉన్నా.. బయట ఉన్నా ఒకటేనని కీచుగొంతుతో చెబుతున్నారు.
చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత .. చంద్రబాబు, లోకేష్, పవన్ ఒక్క సారిగా ఉద్ధృతంగా ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మామూలు ప్రజా వ్యతిరేకతకు తోడు చంద్రబాబుపై సానుబూతి ఏ స్థాయిలో ఉండబోతోందో ఇప్పటిక్ ట్రైలర్ కనిపించింది. అందుకే … చంద్రబాబు మళ్లీ రాజకీయ పర్యటనలు చేయకూడదన్నట్లుగా చెలరేగిపోతున్నారు.