తమకు వ్యతిరేకంగా ఏం జరిగినా… చంద్రబాబు చేశారని ఏడవడం వైసీపీ ముఖ్య నేతలు జగన్ రెడ్డి, సజ్జల రెడ్డి స్టైల్. బీజేపీ తరపున వైసీపీకి వ్యతిరేకంగా ఏం జరిగినా అది చంద్రబాబే చేయించారని ఏడుస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ లో షర్మిల చేరడం కూడా అదే అని చెప్పుకొచ్చారు. ఆయన మాటల్ని చూసి.. వారికైనా సిగ్గు వేస్తుందో లేదో కానీ.. వినేవారికి మాత్రం ఇంత సిగ్గులేని మనుషులు ఉంటారా అని ఆశ్చర్యపోతారు.
తాజాగా ఆయన మీడియాతో అవే మాటలు మాట్లాడారు. వైఎస్సార్ మరణంపై కాంగ్రెస్కు సంబంధించి ఆరోజు నుంచే అనుమానాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అప్పట్లో అంబానీ, కాంగ్రెస్ కలిసి చేసిందని దాడులు కూడా చేశారు.. మరి ఎందుకు నత్వానీకి రాజ్యసభ ఇచ్చారో మాత్రం ఆయన చెప్పరు. జగన్ రెడ్డి దోపిడీకి పాల్పడటం… కాంగ్రెస్, టీడీపీ కుట్రన్నట్లుగా మాట్లాడుతున్నారు. టీడీపీ, కాంగ్రెస్ కలిసే జగన్పై తప్పుడు కేసులు పెట్టాయి.. కాంగ్రెస్తో ఎప్పుడూ చంద్రబాబు కంటాక్ట్లో ఉంటున్నాడని ఆరోపించారు.
షర్మిల కాంగ్రెస్లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని.. చంద్రబాబు తనకేం కావాలో అందరితో కలిసి చేయిస్తాడని ఆరోపించారు. సంక్షేమం పేరుతో ప్రజల్లోకి వెళ్తే చంద్రబాబు మైనస్ మార్కులు వస్తాయని చెప్పుకొచ్చారు. అందుకే ఇష్యూను డైవర్ట్ చేస్తున్నారని తెలివి తేటలు ప్రదర్శించారు. చంద్రబాబును బాహుబలిగా జగన్ రెడ్డి, సజ్జల రెడ్డి ప్రొజెక్ట్ చేస్తున్నారో.. లేకపోతే.. తమ చేతకాని తనాన్ని చంద్రబాబు మీదకు నెట్టేసి… వెర్రి నవ్వులు నవ్వుతూ.. జాలి పడాలని ప్రజల్ని అడుక్కోవాలనుకుంటున్నారో కానీ.. వారి తీరు మాత్రం.. నవ్వుల పాలవుతోంది.