జగన్ పై రాళ్ల దాడి జరిగిందని చెప్పేది సజ్జల రామకృష్ణారెడ్డి. ఎయిర్ గన్ ప్రయోగించారని చెప్పేది కూడా ఆయనే. జగన్ పై హత్యాయత్నం చేశారని చెప్పేది కూడా ఆయనే. కానీ భద్రతా వైఫల్యం లేదని చెప్పేది కూడా ఆయనే. వైసీపీలో కుట్రల నిపుణుడిగాపేరు తెచ్చుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి.. అటూ ఇటూ రెండు వైపులా సమర్థించుకోలేక.. మొత్తం తమ స్క్రిప్టేనని ఒప్పుకునే స్థితికి వస్తున్నారు.
జగన్ పై రాళ్ల దాడి ఘటనలో భద్రతా వైఫల్యం లేదని ఆయన మీడియా ముందుకు వచ్చి వాదించారు. భద్రతా వైఫల్యం అంటున్నా..ఏం వైఫల్యమే చెప్పాలని మీడియా ప్రతినిధుల్ని ప్రశ్నించారు. అదేంటి ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే భద్రతా వైఫల్యం కాక మరేమిటి అంటే.. ఆయన దగ్గర సౌండ్ లేదు. అంతా స్క్రిప్ట్ ప్రకారం పక్కాగా జరిగిపోయింది కదా.. అందులో వైఫల్యం ఏముందనేది.. సజ్జల భావన కావొచ్చు. కానీ జనానికి మాత్రం.. సీఎం భద్రతా సిబ్బంది ఐదు వందల మంది ఆయన చుట్టూ ఉంటారని.. అయినా రాయి పడిందని.. ఇది చేత కాని తనమే కదా డౌట్ కొడుతోంది.
ఇప్పుడు భద్రతా వైఫల్యం లేదని వాదించడం ద్వారా.. అంతా సక్సెస్ అయిందని చెప్పడం ద్వారా సజ్జల తమ ప్రణాళికల్ని పరోక్షంగా అంగీకరించినట్లు అవుతోంది. ఒక్కరాయి వచ్చి పడిందని అంటారు.. దానికి ముగ్గురికి గాయాలయ్యాయి అంటారు. ఇద్దరు కట్లు కట్టుకుని డ్రామాలు ఆడుతున్నారు. పోలీసు అధికారుల్ని ఎక్కడ బదిలీ చేస్తారోనని.. సజ్జల కంగారు పడుతున్నట్లుగా కనిపిస్తోంది. అసలు డ్రామా చేస్తే కొసరు సినిమా కనిపిస్తుందన్నది వైసీపీ ఆందోళనలా ఉంది.