వైసీపీలో చేరకపోతే ఎన్ కౌంటర్ చేస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల బెదిరించారా ? అంటే అవుననే అంటున్నారు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఆయనను రెండున్నర నెలలు జైల్లో పెట్టక ముందు ఓలాయర్ ద్వారా సజ్జల కాంటాక్ట్ అయ్యారు. జగన్ సీరియస్‌గా ఉన్నారని తనను కలవకపోతే ఎన్ కౌంటర్ చేస్తామని సజ్జల బెదిరించారని చింతమని నేరుగా కోర్టును ఆశ్రయించారు. అలా బెదిరించడమే కాదు రెండు సార్లు ఎన్ కౌంటర్‌కు ప్రయత్నం చేశారట. తన దగ్గర ఉన్న సాక్ష్యాలతో చింతమనేని కోర్టును ఆశ్రయించారు.
పోలీసు వ్యవస్థ సజ్జల గుప్పిట్లో ఉందన్నది బహిరంగ రహస్యం. మొదటి రోజు నుంచి టీడీపీ నేతలే టార్గెట్‌గా ఆయన ఆపరేషన్ ప్రారంభించారని టీడీపీ నేతలు చెబుతూంటారు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేను కూడా చంపేస్తామని బెదిరించడంతోనే ఆ పార్టీలో చేరారని చెబుతున్నారు. ఇంకా పలువురికి ఇలాంటి బెదిరింపులు వచ్చాయని అందకే పార్టీలు మారారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు చింతమనేని వాటిని నేరుగా ప్రస్తావిస్తూ కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు.
గత మూడేళ్ల కాలంలో టీడీపీ నేతలపై ఇష్టా రీతిన కేసులు పెట్టారు. ఎంతో మందిని తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నించారు. కొంతమంది చేరారు. మరికొంత మంది తిరగబడ్డారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో సజ్జల పార్టీ నేతల్ని చంపుతామని కూడా బెదిరించిన ఘటనలు మాత్రం సంచలనం రేపుతున్నాయి. పోలీసులతో ఎన్ కౌంటర్లు చేయిస్తామని బెదిరించారన్న విషయం బయటకు తెలియడం ఇప్పుడు సంచలనాత్మకం అవుతోంది. చింతమనేని వేసిన ప్రైవేటుకేసులో విచారమ జరిగి నిజానిజాలు తెలిస్తే .. సంచలనం అయ్యే అవకాశం ఉంది. అయితే అది ప్రభుత్వం మారిన తర్వాతే జరగడానికి చాన్స్ ఉంది.