సకల శాఖా మంత్రిగా, సీఎంకు ముఖ్య సలహాదారుగా… జగన్ పాలనలో చక్రం తిప్పిన సజ్జల, ఎన్నికల్లో ఓటమి తర్వాత మీడియా ముందు పెద్దగా కనిపించలేదు. ఇటు ఓటమిపై జగన్ నుండి ఓడిన ఎమ్మెల్యేల వరకు తలో మాట మాట్లాడుతూ వచ్చారు.
తమ హాయంలో పథకాలు చెప్పుకుంటూ… వారి ప్రేమ ఏమైందో అని జగన్ నిర్వేదంతో పాటు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు.
తాజాగా వైఎస్ జయంతి కార్యక్రమంలో సజ్జల మాట్లాడుతూ… ఓటమిపై అనుమానాల సంగతి ఎలా ఉన్నా, ప్రజల తీర్పుగానే భావిస్తున్నామని ఓటమిని ఒప్పుకున్నారు. అంతేకాదు మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అని ఎన్నికలకు వెళ్లాం. కానీ ఫలితాలు వేరుగా వచ్చాయన్నారు. అంటే జనం తిరస్కరించారని ఓటమిని ఒప్పుకున్నారు. వైఎస్ కు అసలైన రాజకీయ వారసుడు జగనేనని పరోక్షంగా షర్మిలకు కౌంటర్ ఇచ్చారు సజ్జల.