ఏపీ ప్రభుత్వ పెద్దలకు అధికార మైకం పూర్తి స్థాయిలో కమ్మేసింది. తాము ఏం చేస్తున్నామో… ఎందుకు చేస్తున్నామో.. ఎలా చేస్తున్నామో కూడా రివ్యూ చేసుకోలేని పరిస్థితుల్లో పడిపోయారు. టెన్త్ పేపర్ లీకయిందో.. మాల్ ప్రాక్టిస్ జరిగిందో కూడా క్లారిటీ లేకుండా ఓ సారి లీక్ అని..మరోసారి మాల్ ప్రాక్టీస్ అని చెబుతూ..ఈ కేసులో ఏకంగా నారాయణ స్కూల్ ఫౌండర్ చైర్మన్ నారాయణను అరెస్ట్ చేసేశారు. నిందితులు అందరూ ఇప్పుడు, గతంలో కూడా నారాయణ స్కూల్స్లో పని చేశారని.. నారాయణే పేపర్ లీక్ చేయమని ఆదేశాలిచ్చారని అందుకే అరెస్ట్ చేశామని వాదిస్తున్నారు.
ఆయన ఇప్పుడు నారాయణలో ఎలాంటి పదవుల్లో లేరని తేలడంతో కింది కోర్టు బెయిల్ ఇచ్చింది. దీనిపైనా సజ్జల మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేశారు. ఎప్పట్లాగే న్యాయవ్యవస్థను చంద్రబాబు మేనేజ్ చేశారని ఆరోపించారు. అంతటితో ఆగలేదు.. ఏదో అయిపోయిందన్నట్లుగా మూడున్నరకు బెయిల్ ఇచ్చారని ఆరోపించారు. వారు ఆ సమయంలో కోర్టులో ప్రవేశ పెట్టారు కాబట్టి ఆ సమయంలో బెయిలిచ్చారనే్ సంగతి ఎవరికీ తెలియనట్లుగా సజ్జల నటించేస్తున్నారు. బెయిల్ రద్దు కోసం పైకోర్టుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. నారాయణ ను రిమాండ్ కు తరలించడానికి రిమాండ్ రిపోర్ట్ కూడా రెడీచేశారు.
అందుకో నిందితులంతా ఒకే రకమైన వాంగ్మూలం ఇచ్చారు. అందరూ కూడబలుక్కుని నారాయణే తమకు లీక్ చేయమని చెప్పారన్నట్లుగా స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లనే రిమాండ్ రిపోర్టుగా చూపించారు. మొత్తంగా నారాయణ అరెస్టు ప్రజల్లో ఓ రకమైన భావన ఏర్పడటంతో సజ్జల కవర్ చేసుకునేందుకు తంటాలు పడుతున్నారు. విద్యార్థుల భవిష్యత్.. విద్యా మాఫియా అంటూపెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. తప్పు చేసి దొరికిపోయిన వారిలో ఉండే కంగారు సజ్జల మొహంలో కనిపిస్తోందని టీడీపీ నేతలంటున్నారు.