స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఒక్క సాక్ష్యం కూడా చూపించలేకపోయారని చంద్రబాబు బెయిల్ పిటిషన్ తీర్పులో హైకోర్టు తేల్చేస్తే… తీర్పు వచ్చిన గంటలోనే .. తన తీర్పును వైసీపీ జడ్జి సజ్జల నీలి, కూలి మీడియా లో ప్రకటించారు. ఆయన చెప్పిన సాక్ష్యాలేమిటంటే… ఇప్పటి వరకూ… సాక్షిలో వచ్చిన.. జంట కవులు సీఐడీ చీఫ్, ఏఏజీ చెబుతున్న విషయాలే.
స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం నిధులు దారి మళ్లాయంటారు.. షెల్ కంపెనీల పేరుతో పోయాయంటారు. ఎవరికి పోయాయో ఆధారాాలు చూపించరు. కిలారి రాజష్, పెండ్యాల స్రీనివాస్ కు నోటీసులు ఇచ్చారంటారు. కిలారి రాజేష్ ను అసలు నిందితుడని కూడా సీఐడీ చేర్చలేదు. తాము చెప్పవే సాక్ష్యాలని సజ్జల చెబుతున్నారు. సాక్షిలో రాసినవి.. తాము చెప్పినవి మాత్రమే సాక్ష్యాలని .. మీడియా ముందుకు వచ్చి హైకోర్టు తీర్పుపై ఎదురుదాడి చేశారు.
తప్పుడు కేసులు పెట్టి… కొన్ని విషయాలు మాత్రమే బయటపెట్టి.. అదే నిజమని నమ్మించి … ప్రజలందర్నీ పిచ్చోళ్లు అని అనుకుంటున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు సంతకాలు పెట్టారు… .డబ్బులు విడుచేయమన్నారు.. అంటారు. అయితే తప్పేంటి ?. అందులో అవినీతి ఉంటే చూపించమంటే.. వారి వల్ల
కాలేదు. లఎంత ఎదురుదాడి చేసినా.. కనీస సాక్ష్యం లేని కేసులు ఎప్పటికైనా తేలిపోతాయి. అంతటితో సినిమా అయిపోదు కదా. ఈ కుట్రల కేసుల వెనుక ఉన్న దెవరో తేలేందుకు ఎక్కువ కాలం పట్టకపోవచ్చు.