గుక్కపెట్టి ఎడవడానికి వైసీపీ నేతలు రోజుకో కారణం వెదుక్కుంటున్నారు. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ వచ్చిందని.. నిద్రపోకుండా.. కథలు రాసుకుని పొద్దున్నే సుప్రీంకోర్టుకు వెళ్లారు. అది అలా ఉండగానే తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టిన కుట్రల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి .. టీడీపీ సేవా మిత్ర యాప్ స్క్రీన్ షాట్స్ తీసుకు వచ్చి ఏదో జరిగిపోతోందని చెప్పుకొచ్చారు. టీడీపీ ప్రజల డేటా సేకరిస్తోందని.. చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతన్నారని ఆరోపించారు. టీడీపీ సేవామిత్రపై గత ఎన్నికలకు ముందు హైదరాబాద్ పోలీసుల సహకారంతో డేటా చోరీ పేరుతో ఆడిన డ్రామా అందరికీ గుర్తు ఉంది.
ఇప్పుడు మళ్లీ అదే చేస్తున్నారు. సేవా మిత్ర యాప్ అనేది టీడీపీ అంతర్గత ఉపయోగానికి పెట్టకుంది. భవిష్యత్ భరోసా పేరుతో ఇంటింటికి వెళ్లి టీడీపీ అధికారంలోకి వస్తే ఇవ్వబోయే పథకాల గురించి ప్రచారం కోసం ఉపయోగిస్తున్నారు. అందులో టీడీపీ కార్యకర్తల సమాచారం ఉంటుంది. టీడీపీలో సభ్యత్వం కావాలనుకునేవారు ఓటర్ ఐడీని ఇవ్వాలి. టీడీపీనే కాదు ఏ పార్టీ అయినా సభ్యత్వానికి ఓటర్ కార్డు తీసుకుంటుంది. అదే తప్పయినట్లుగా సజ్జల ప్రెస్ మీట్ పెట్టేశారు. బహుశా.. ఈ అంశంపైనా కేసులు పెట్టే ఆలోచనలో ఉన్నారేమో కానీ.. సజ్జల ఫ్రెస్ట్రేషన్ మత్రం ఓ రేంజ్ ఉంది. టీడీపీ ఏం చేసినా తప్పేనన్నట్లుగా ఉంది. చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లడం తప్పు. లోకేష్ పాదయాత్ర చేయడం తప్పు. టీడీపీ మేనిఫెస్టో ప్రకటించడం తప్పు. ప్రజలకు ముందస్తుగా భవిష్యత్ కు గ్యారంటీ పేరుతో కార్డులివ్వడం తప్పన్నట్లుగా మాట్లాడుతున్నారు.
చివరికి కేసులు పెట్టి అందర్నీ జైళ్లలో పెట్టి.. తామే రాజ్యం చేయాలనుకునే ఓ ఘోరమైన ఆలోచనకూ వచ్చారు. వీరిని చూసి సొంత పార్టీ నేతలు కూడా పాపం అనుకునే పరిస్థితి. ఓ వైపు ఘోరమైన పరిపాలన చేస్తూ.. మరో వైపు ప్రతిపక్షం చేస్తున్న ప్రజాస్వామ్య పోరాటాలను కూడా తప్పుగా చూపిస్తూ.. కేసులు పెట్టుకుంటూ… శోకండాలు పెట్టే స్థితికి వైసీపీ దిగజారిపోయిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.