జగన్మోహన్ రెడ్డి దేశంలో లేని సమయంలో మహానాడు జరిగింది. అదే సమయంలో వైసీపీ నేతలకు పెద్ద టాస్క్ ఇచ్చి వెళ్లారు. మహానాడుకు కవరేజీ తగ్గించి బస్సు యాత్రకు పెంచేలా భారీ జనసమీకరణ చేాయలని ఆదేశించారు. కానీ ఆచరణలో జరిగింది వేరు. అదే సమయంలో మహానాడుకు సరిగ్గా కౌంటర్ ఇవ్వలేకపోయారని.. చంద్రబాబు చేసిన విమర్శలను కూడా తిప్పికొట్టలేకపోయారుని జగన్ భావించారు. అందుకే దావోస్ నుంచి వచ్చిన తర్వాత పార్టీ నేతలకు గట్టిగా హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.
టీడీపీ అంత ఘాటు విమర్శలు చేసినా ఎందుకు స్పందించలేదని ఆయన సజ్జల సహా అందరికీ తలంటుడంతో హడావుడిగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. మహానాడు ముగిసిపోయి నాలుగైదురోజులు అవుతున్నా.. ఇప్పుడు ఆయన మహానాడులో చంద్రబాబు అలా అన్నారు.. ఇలా అన్నారు అంటూ తెగ ఫీలైపోతూ మాట్లాడారు. ఇంత ఆలస్యంగా ఎందుకు స్పందిస్తున్నారంటే ఆయన వద్ద సమాధానం లేదు.
మొత్తంగా తాను లేని సమయంలో పార్టీని భ్రష్టు పట్టించారని.. పట్టించుకోలేదని జగన్ సీనియర్ నేతలపై మండిపడినట్లుగా తెలుస్తోంది. ఆధిపత్య పోరాటానికి పోయి బస్సు యాత్రను కూడా పట్టించుకోలేదన్న అభిప్రాయం జగన్‌లో ఉందంటున్నారు. జగన్ ఆగ్రహాన్ని చూసిన సజ్జల వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు. ఇతర నేతలు కూడా రేపట్నుంచి మహానాడుకు కౌంటర్లు ఇస్తారేమో చూడాలి.