జీపీఎఫ్ సొమ్మును ఎనిమిది వందల కోట్లు ఆన్ లైన్ ఫ్రాడ్ తరహాలో కొట్టేసిందని ఉద్యోగులు తీవ్ర స్థాయిలో విమర్శలుచేస్తూ..పోలీసు కేసు పెడతామని ఓ వైపు హెచ్చరికలు చేస్తూంటే.. ప్రభుత్వ సలహాదారు సజ్జల మాత్రం అదేదో టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అన్నట్లుగా మీడియా ముందుకు వచ్చి నటించేశారు. ఉద్యోగుల సొమ్ము రూ.800 కోట్లు మాయం కావడానికి ఇదేమైనా మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ కాదని చెప్పుకొచ్చారు. మార్గదర్శి కంపెనీపై ప్రజలకు ఎంత నమ్మకం ఉందో.. వైఎస్ హయాంలోనే బయటపడింది. ఎంత రచ్చ చేసినా వారి దగ్గర డిపాజిట్ చేసిన వారెవరూ తిరిగి ఇమ్మనలేదు. కానీ డిపాజిట్లను మార్గదర్శి తిరిగి ఇచ్చేసింది.
ఇప్పటికీ చిట్ ఫండ్ కంపెనీ ఎలాంటి ఫిర్యాదులు లేకుండా కొనసాగుతోంది. వేల కోట్లవ్యాపారం చేస్తోంది. కానీ ప్రభుత్వంపై ఇప్పుడు ఎవరూ నమ్మకం పెట్టుకోలేకపోతున్నారు. ఉద్యోగులు దాచుకున్న సొమ్ములు కూడా ప్రభుత్వం ఇవ్వలేకపోతోంది. చివరికి వారి అకౌంట్లో జీపీఎఫ్ సొమ్ములూ తీసేసుకుంది. సామాజిక పెన్షన్ లకు డబ్బులు లేక .. ఉద్యోగుల జీపీఎఫ్ వెనక్కి తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.
ఇవన్నీ పక్కన పెట్టి..అన్నీ టీడీపీ ఆరోపణుల చేస్తోందని.. మాయా యుద్దం చేస్తోందని సజ్జల కవర్ చేసుకుంటున్నారు. అన్నీ ఓ రకరమైన అవాస్తవాల మీద.. ప్రభుత్వం నడిచిపోతున్నదని స్పష్టంగా కనిపిస్తోంది. స్పష్టంగా బయట కనిపిస్తున్న వాటినే అవాస్తవలుగా చెప్పి సజ్జల అందర్నీ మభ్య పెట్టేద్దాం అనుకుంటున్నారు. కానీ ఓటర్లు మరీ అంత అమాయకులు కాదనే సంగతిని గుర్తించలేకపోతున్నరాు. ఓటర్లను తక్కువగా అంచనా వేస్తూనే ఉన్నారు.