వైసీపీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకోవడంతో పార్టీలో నెంబర్ 2గానున్న సజ్జల రామకృష్ణారెడ్డి పరిస్థితి కూడా మారిపోయింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి పెద్దగా కనిపించని సజ్జల.. తాజాగా జగన్ నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలోనూ జగన్ పక్కన కనిపించకుండా ఎక్కడో కింద ఓ మూలనున్న సీట్లో కూర్చోవడం చూసి పార్టీ నేతలు సైతం షాక్ అయ్యారు.
వైసీపీ హయాంలో జగన్ ఎక్కడుంటే అక్కడే కనిపించిన సజ్జల.. అధికారం కోల్పొయేసరికి ఓ మూలకు పరిమితం అవ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వైసీపీ ఘోర పరాజయంలో సజ్జల పాత్ర కూడా ఉందని విశ్లేషణలతో జగన్ ఆయనను దూరం పెడుతుండటంతోనే వెనక సీట్లో ఆసీసులు అయ్యారా..? లేక ఇంకా తాను జగన్ పక్కన ఉంటే పార్టీలో తనపై తిరుగుబాటు వస్తుందని ఆందోళనతోనే వెనక్కి సీట్లోకి వెళ్ళారా…? అనేది వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
జగన్ కు ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఏమైనా చెప్పుకోవాలంటే సజ్జల అనుమతి ఉండాల్సిందే. ఇదే అసలు వాస్తవాన్ని జగన్ కు చేరకుండా, పార్టీ దారుణమైన ఓటమికి దారితీసిందని పలువురు నేతలు ఇటీవల స్పష్టం చేశారు. ఇక నుంచి తనతో స్వేచ్చగా మాట్లాడవచ్చని,మధ్యన ఎవరూ ఉండరని జగన్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే సజ్జల ప్లేసు వెనక్కి వెళ్ళడం ఆసక్తికరంగా మారింది.