సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే మారింది. జగన్ రెడ్డి గురువారం ప్రచారానికి విశ్రాంతి తీసుకున్నారు. ఇక టీవీల్లో కొనుక్కున్న స్లాట్లలో ఎవరో ఒకరు కనిపించాలి కాబట్టి సజ్జల మీడియా ముందుకు వచ్చేశారు.
సలహాదారులు రాజకీయాలు మాట్లాడకూడని ఈసీ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. కానీ ఏం చేసుకుంటారో చేసుకోండన్నట్లుగా సజ్జల మీడియతో రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఆయన రెండుగంటలకుపైగాప్రెస్ మీట్ పెట్టి.. టీడీపీ మేనిపెస్టోను విడమర్చి చెప్పారు. ఇది రోజూ జగన్ చేస్తున్నదే.చంద్రబాబు అమలు చేయలేరని చెప్పడం వైసీపీ స్ట్రాటజీ . సజ్జల కూడా అదే చెప్పారు. అంతటితో ఆగిపోతే బాగుండేది. కానీ చేయగలిగేవే జగన్ చెప్పారని.. పెద్ద పెద్ద డైలాగులు చెప్పుకొచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డికి కూడా సజ్జల వివరించిన స్కీములు అమలు చేయడం చేతకాదని చెప్పినట్లయింది. మరి అలాంటప్పుడు.. టీడీపీ మేనిఫెస్టో గురించి ఎందుకు అంత వర్రీ అవుతున్నారు ?
చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజల కోసం రూపొందించారు. అమలు చేస్తారో లేదో వారే డిసైడ్ చేసుకుంటారు. చంద్రబాబు అమలు చేయరని.. ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నించే హక్కు వైసీపీకి ఉంది. కానీ దానికి .. జగన్ సామర్థ్యానికి లింక్ పెట్టడమే కాస్త తేడాగా ఉంది. పదేపదే జగన్ చేయగలిగేవే చెప్పారంటూ.. సర్టిఫికెట్ ఇస్తున్నారు. అంటే.. టీడీపీ ఇచ్చిన హామీలను జగన్ చేయలేరనే కదా.. మరి చేస్తామంటున్న టీడీపీకి ఓటు వేస్తే సరిపోతుంది కదా అన్న ఆలోచనకు జనం వస్తున్నారు. ఈ విషయంలో టీడీపీ మేనిఫెస్టోకు ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలకు టీడీపీ ధ్యాంక్స్ చెప్పుకోవాలి వైసీపీ క్యాడర్.. ఓటర్లలోకి కూడా టీడీపీ మేనిఫెస్టోను చొచ్చుకెళ్లేలా చేయడంలో సజ్జలది ప్రత్యేకమైన కృషి అనుకోవచ్చు. అదే సమయంలో జగన్ చేతకాదని కూడా చెప్పేస్తున్నారు కాబట్టి.. వైసీపీ క్యాడర్, ఓటర్లకు మరో అవకాశం ఇవ్వడం లేదు. అందర్నీ టీడీపీ వైపు నెట్టేస్తున్నారు.