అధికారం ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి బిల్డప్పులు కొడతారు… అది పోయిన తర్వాతనే వచ్చి తొడకొట్టాలి అని వైసీపీలోనే ఇప్పుడు సజ్జల భార్గవ్ రెడ్డిని ఉద్దేశించి కొంత మంది పోస్టులు పెడుతున్నారు. ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడే కనిపించకుండా పోయిన ఆయన… సోషల్ మీడియాను నడుపుతున్నానని చెప్పుకోవడానికి కూడా భయపడిపోతూ బతుకుతున్నారు. సోషల్ మీడియా పోస్టులు అయితే నోటీసులు ఇచ్చే వదిలేస్తోంది ఏపీ ప్రభుత్వం. కానీ తెనాలిలో వైసీపీ సోషల్ మీడియా కోసం పని చేస్తూ చనిపోయిన గీతాంజలి అనే మహిళ విషయంలో సజ్జల భార్గవ్ రెడ్డిపై అనుమానాలు ఉన్నాయి.
గీతాంజలి చనిపోయిన తీరే అనుమానాస్పదం అయితే.. .. ఆ తర్వాత సోషల్ మీడియా ట్రోలింగుల వల్ల చనిపోయిందని వ్యూహాత్మకంగా ప్రచారం చేసి తప్పుదోవ పట్టించారు. ఇప్పుడు ఆ కేసులో తీగ లాగితే సజ్జల భార్గవ్ ఇబ్బంది పడాల్సి వస్తుందన్న కారణంగా ఆయన పూర్తిగా ఇనాక్టివ్ అయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రిస్క్ ఎందుకు అని తన కుమారుడ్ని సోషల్ మీడియా ఇంచార్జ్ పదవి నుంచి తప్పించేలా జగన్ తో మాట్లాడారు. ఇప్పుడు కొత్త వ్యక్తిని పెట్టినట్లుగా లీకులు ఇచ్చారు.
కొడుకును కాపాడుకోవడానికి ఇతురుల్ని బలి చేయడానికి సజ్జల రెడ్డి ప్లాన్ చేసుకున్నారు. మరి ఇతరులు బలి కావొచ్చా అంటే.. వైసీపీ స్ట్రాటజీ అదే. వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు పదేళ్లు కష్టపడిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒరిగిందేమీ లేదు. బర్మాలో బిజినెస్ చేస్తున్నానని గొప్పగా చెప్పుకున్న సజ్జల భార్గవరెడ్డి మాత్రం పదవిలో కూర్చున్నారు. పదవ పోగానే వెళ్లిపోయారు. ఇక సామాన్య వైసీపీ కార్యకర్తలకు ఎలా ధైర్యం వస్తుంది.