నా మీద ఏ కేసూ లేదు .. నా మీద లుకౌట్ నోటీసులు ఏంటి అని సజ్జల రామకృష్ణారెడ్డి ఎయిర్పోర్టులో బీపీ తెచ్చుకున్నారట. ఈ విషయం ఇప్పుడు వైసీపీలోనే హాట్ టాపిక్ అవుతోంది. సజ్జలపై కేసులు లేకపోవడం ఏమిటి ఆయన ముందస్తు బెయిల్ కోసంప్రయత్నించి సుప్రీంకోర్టు నుంచి రక్షణ పొందారు కానీ కనీసం ముందస్తు బెయిల్ కూడా రాలేదు.
నిజానికి సజ్జల రామకృష్ణారెడ్డికి ఇది మొదటి ట్రీట్మెంట్ కాదు. ఆయనకు ఇంకా చాలా పెండింగ్ లో ఉంటాయి. ఎందుకంటే వైసీపీ హయాంలో జరిగిన ప్రతి తప్పుడు పనికి.. ఇంకా చెప్పాలటే అక్రమ కేసులకు.. ఆయనకే మాస్టర్ ప్లానరే. పోలీసులు, సీఐడీని గుప్పిట్లో పెట్టుకుని అడ్డగోలు రాజకీయం అంతా చేశారు. వ్యాపారుల్ని బెదిరించారు. టీడీపీ నేతలు అంటే కేసులు పెట్టడమే అన్నట్లుగా వ్యవహరించారు.. ఏం జరిగినా అంతా ఆయన కుట్రే. కాదంబరి జెత్వానీ ఎపిసోడ్ స్క్రిప్ట్ సజ్జలదే.
టీడీపీ నేతల్ని వేధించడంలో జగన్ రెడ్డి ఈగోను శాటిస్ ఫై ఎలా చేయాలో అలా వేధించేందుకు ప్లాన్ చేసేవారు. ఏదో ఓ కేసు పెట్టి అందరిపై లుకౌట్ నోటీసులు జారీ చేసేవారు. మార్గదర్శి ఇష్యూలో రామోజీ కుటుంబం అందరిపై అదే పని చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు విదేశాలకు వెళ్తూంటే లుకౌట్ నోటీసులు లేకపోయినా అడ్డుకునే ప్రయత్నం చేయించారు. చేసిందంతా చేసి తాను రాజ్యాంగేతర శక్తినని.. తాను రాజ్యాంగం పరిధిలోని కేసులకు అతీతమని ఆయన అనుకుంటున్నారు. అక్కడే ఆయన అతి తెలివి తేటలు బయటపడుతున్నాయి. చట్టం చేతులు చాలా పెద్దవని నిరూపితం అవుతోంది. సజ్జలకు అసలు సినిమా ఇంకా ప్రారంభం కావాల్సి ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.