సమయస్ఫూర్తిగా పారిపోవడం కూడా ఓ కళ అని వైసీపీ నిరూపిస్తోంది. కేసులు నమోదు కాగానే పారిపోవాలని వైసీపీ నేతలకు పార్టీ ఆఫీసు నుంచి ఎలా సమాచారం ఇస్తున్నారో అలాగే ఎన్నికల నుంచి పారిపోదామని జగన్ కు సలహాలు ఇస్తున్నారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో వైసీపీ వైఫల్యం ఇప్పుడు ఆ పార్టీ నేతల్ని కూడా విస్మయానికి గురి చేస్తోంది. పార్టీకి పట్టు ఉన్న గ్రామాల్లోనూ సాగునీటి సంఘాలను కైవసం చేసుకోలేకపోవడం ఏమిటన్న వాదన వినిపిస్తోంది.
ఏ పార్టీ అధికారంలో ఉన్న పులిందులలో సాగునీటి సంఘాలు మాత్రమేకాదు.. పంచాయతీలు, మున్సిపాలిటీ అన్నీ జగన్ కుటుంబం చేతుల్లోనే ఉండేవి. కానీ ఇప్పుడు ఏమయింది.. ఒక్కటంటే ఒక్క సాగునీటి సంఘం కూడా గెలవలేకపోయింది. దీనికి కారణం ఏమిటంటే పోటీ చేయవద్దని సజ్జల రామకృష్ణారెడ్డి సలహా ఇవ్వడం . ఆయన సలహాలను జగన్ పాటించడం. ఓడిపోతే పోయారు కానీ అసలు పోటీ చేయకుండా పారిపోవడం అనే సలహా ఇవ్వడం దానిని జగన్ పాటించడం ఏమిటో వైసీపీ నేతలకూ అర్థం కావడం లేదు.
సజ్జల రామకృష్ణారెడ్డి తన చీప్ చీప్ సలహాలతో పార్టీని నిండా ముంచారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ అనధికారికంగా సీఎంగా చెలామణి అయి సకల శాఖల్లో వేలు పెట్టి.. పాతాళానికి పడిపోయేలా చేశారు. ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తరవతా కూడా ఆయన వదిలి పెట్టడం లేదని.. గట్టిగా మట్టిపోసి పైకి లేవకుండా సిమెంట్ తో దిమ్మ కట్టేస్తున్నారని చాలా మంది మథనపడుతున్నారు.