ఈ నెల 21 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కు ఎన్నికల కమిషన్ సన్నద్దం అయింది. ఈ క్రమంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి నాయకులు అలర్ట్ అయ్యారు. నియోజకవర్గాల వారీగా దొంగ ఓట్ల వ్యవహరంలో అలర్ట్ గా ఉండాలని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి శ్రేణులకు సూచించారు. అంటే ఇప్పటికే నమోదు చేసిన ఓట్లను తొలగించకుండా చూడటం… తీసేసిన ఓట్లను మళ్లీ చేర్చకుండా చూడటం ఏమోనని టీడీపీ నేతలు సెటైర్లు వేసుకుంటున్నారు.
ఏఐ టెక్నాలజీని వాడి… వాలంటీర్ల ద్వారా సేకరించిన సమాచారంతో ఓటర్ల జాబితాను పూర్తి స్థాయిలో గందరగోళం చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే దీనిపై స్పష్టమైన ఆదారాలు ఉండటంతో రాష్ట్ర ఎన్నికల అధికారి సైతం ఢిల్లీకి వెళ్లి పరిస్దితులను వివరించారు. ఈ వ్యవహరంతో రాష్ట్రంలోని ఓటర్ల జాబితా పై ప్రత్యేకగా సమగ్ర సవనరణకు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీని పై రాజకీయ పార్టిలు అలర్ట్ అయ్యాయి. ఎక్కడెక్కడ దొంగ ఓట్లు ఉన్నాయనే విషయాలు పై పార్టీలు పోటా పోటీగా వివరాలను సేకరించే పనిలో ఉన్నాయి..
అయితే ఇప్పటి వరకూ చేసిన పని బూడిదలో పోసిన పన్నీరు అవుతుందేమోనని సజ్జల కంగారు పడుతున్నారు. అందుకే క్యాడర్ అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. 2014. నుంచి 2019 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బోగస్, సెకండ్ ఓట్లను చేర్పించి వ్యవస్ధను పూర్తిగా నిర్వీర్యం చేసిందని సజ్జల చెబుతున్నారు. నిజంగా అలా చేసి ఉంటే టీడీపీ బంపర్ మెజార్టీతో గెలిచి ఉండేది. పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు కోసం.. దరఖాస్తులు చేసి అడ్డంగా దొరికిపోయింది వైసీపీ నేతలే. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఊరుకుంటారా.. చేయాల్సిందంతా చేస్తున్నారు. ఇప్పుడు ఈసీ పరిశీలన చేస్తూండటంతో ప్రత్యేక దృష్టి పెట్టారు.