స్కిల్ స్కాం పకడ్బందీగా జరిగిన నేరం. ఈ కేసులో చంద్రబాబు పాత్ర ఉందనడానికి పక్కా సాక్ష్యాలను సీఐడీ చూపిస్తుంది. రెండేళ్ల కిందటే సీఐడీ కేసు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయింది. అని.. సూపర్ సీఐడీ ఆఫీసర్ తరహాలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకూ సీఐడీ చేసిన అరెస్టులన్నింటిలోనూ గొప్ప సాక్ష్యాలున్నాయని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటి వరకూ ఒక్క కేసులోనూ ఆధారాలు చూపించి చార్జిషీటు దాఖలు చే్యలేకపోయారు.
పోలీసులు ఎప్పుడు ఏం చేయాలో చెబుతూ.. అనధికారిక హోంమంత్రిగా చెలామణి అవుతున్న సజ్జల .. చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత సీఐడీ కేసులోనూ తానే ముందు మాట్లాడారు. రాత్రికి రాత్రి జరిగిందని కాదని చెప్పుకొచ్చారు. గతంలో చేసిన ఆరోపణల్నే మళ్లీ చెప్పారు. కానీ.. ఎలాంటి సాక్ష్యాలు ఉంటాయో మాత్రం చెప్పలేదు. ఆరోపణలు ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం కామనేనని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు అన్నీ తెలుసని అందుకే రెండు, మూడు రోజుల నుంచి అరెస్ట్ అంటున్నారని వాదించారు.
అయితే సజ్జల ఎందుకు ఆత్ర పడుతున్నారో పోలీసు వర్గాలకూ ఆశ్చర్యంగానే ఉంది. సజ్జల ప్రెస్ మీట్ అయిపోయిన గంట తర్వాత సీఐడీ అధికారులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారని మీడియాకు సమాచారం ఇచ్చారు.
నిజంగా చంద్రబాబుపై స్కాంకు ఆధారాలుంటే.. మీడియాలో కావాల్సినంత ప్రచారం చేసుకుని ఆ తర్వాత అరెస్ట్ చేసేవారు. పనికి మాలిన ఐటీ నోటీసుల్ని పట్టుకుని వీలైనంత ప్రచారం చేసుకున్నారు.. మరి సాక్ష్యాలుంటే ఊరుకుంటారా?. జగన్ రెడ్డి తన కోరికను నేరవేర్చుకోవడానికి లండన్ వెళ్లి అక్కడ్నుంచి .. ఈ వ్యవహారం చూసుకుంటూ.. సజ్జలను ముందుపెట్టి.. ఈగో శాటిస్ ఫై చేసుకుంటున్నారని ఎవరికయినా అర్థం అవుతుంది.