అమలాపురం దాడుల వెనుక వైసీపీ నేతల కుట్ర ఉందన్న తీవ్ర ఆరోపణలు వస్తూండటంతో ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెరపైకి వచ్చారు. విపక్షాల విమర్శలు చూస్తుంటే… నవ్వొస్తుంది… అధికార పార్టీ నేతలప ఇళ్లపై ప్రభుత్వం ఎందుకు దాడులు చేసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. మా మంత్రులు, ఎమ్మెల్యేలపై మేం ఎందుకు దాడులు చేస్తాం… అలా దాడులు చేయించుకుని ఏం సాధిస్తామని ఆయన ప్రశ్నించారు. విపక్ష నేతల ఆరోపణలపై ప్రజలు చీదరించుకుంటారు. ఇవి దుర్మార్గపు రాజకీయాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అటాక్ ప్లాన్ చేసింది చేయించింది.. దాన్ని మాపై వేయాలని చూస్తుంది విపక్షాలు అని ఆయన ఆరోపించారు. విపక్ష నేతలందరూ కూడబలుక్కుని ఒకే విధమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్ టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదివారని సజ్జల విమర్శిస్తున్నారు.
ఓ వైపు సజ్జల.. వైసీపీ నేతలు… తమకేం సంబంధం లేదని చెబుతున్నారు కానీ క్షేత్ర స్థాయిలో అల్లర్లకు కారణంగా భావిస్తున్న అన్యం సాయి అనే వ్యక్తితి పోలీసులు పట్టుకున్నారు. సీసీ టీవీ కెమెరాలో అతని వ్యవహారం అనుమానాస్పదంగా ఉండటంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అతను విశ్వరూప్‌కు అనుచరుడని కొన్ని ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. జనసేనలోనూ కీలకంగా పని చేశాడని మరికొన్ని ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు కానీ.. ఆయనపై గతంలో రౌడీ షీట్ఉందని.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎత్తేశారని చెబుతున్నారు.
మరో వైపు తన ఇంటిపై దాడి చేసిన వారిలో అన్ని పార్టీల నేతలూ.. చివరికి తమ పార్టీ వారు కూడా ఉన్నారని.. మంత్రి విశ్వరూప్ చెబుతున్నారు. తమ పార్టీ కౌన్సిలర్ ఉన్నాడని… టీడీపీ, జనసేన, బీజేపీ ద్వితీయ శ్రేణి నేతలున్నారనిచెబుతున్నారు. ఎవర్నీ వదిలి పెట్టబోమని అంటున్నారు. మొత్తంగా ఈ దాడి వ్యవహారం రాజకీయం అయిపోయింది. ఎవరికి వారు ఆరోపణలు చేసుకుంటున్నారు. పోలీసులు మాత్రం ఇంకా సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించే ప్రయత్నాల్లోనే ఉన్నారు.