సజ్జల రామకృష్ణారెడ్డి తానో పెద్ద మేధావినని నిరూపించుకోవాలనకుుంటున్నారో లేకపోతే.. స్కిల్ కేసు మొత్తాన్ని తానే మొదటి నుంచి రచించి, దర్సకత్వం చేస్తున్నారో కానీ.. చెప్పిందే చెప్పి… అదే పనిగా మీడియాలో ప్రచారం చేసి ఏదో ఘనకార్యం చేశామని అనుకుంటున్నారు. రెండేళ్ల కింద కేసు పెట్టినప్పుడు ఏం చెప్పారో… ఇప్పటికీ అదే చెబుతుున్నారు. అసెంబ్లీలో జగన్ రెడ్డి తో కూడా అదే చదివించారు. ఇప్పుడు రిమాండ్ రిపోర్టులోనూ అదే ఉంది. సజ్జల ప్రెస్ మీట్ పెట్టి అదే చెప్పారు. సీఐడీ చీఫ్ అదే చెప్పారు. చెప్పిందే చెబుతున్నారు కానీ..అందులో ఉన్న వాటికి ఒక్కటైనా సాక్ష్యం ఉందా అంటే… చెప్పడం లేదు.
స్కిల్ స్కాం ఆధారాలపై విస్తృత చర్చ జరుగుతూండటంతో.. సజ్జల మరోసారి తెరపైకి వచ్చారు. ఈ సారి ఏదో జరిగిపోయినట్లుగా ప్రచారం చేస్తున్న జీవోలను తీసుకొచ్చి.. ఇదిగో ఇలా ఉందని చెబుతున్నారు. అలా ఉండటం ఎలా తప్పవుతుంది.. దానికి సాక్ష్యమేంటి అన్నది చెప్పడం లేదు. సీఐడీ రిమాండ్ రిపోర్టును కోర్టు అనుమతించింది కాబట్టి ఇక .. తప్పు జరిగిపోయినట్లేనని సజ్జల అంటున్నారు. రిమాండ్ రిపోర్టులో ఒక్క సాక్ష్యం కూడా చూపించలేదు.. ఎలా జరిగిందంటే మాత్రం చెప్పడం లేదు. సజ్జల సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టినా.. అసలు చంద్రబాబుకు ఎక్కడ లింక్ ఉందన్నది మాత్రం చెప్పడం లేదు. తాము ఏది చెబితే అది స్కాం అని ప్రజలు నమ్మేస్తారన్న నమ్మకంతో ఇప్పటికీ అదే చెబుతున్నారు. రిమాండ్ చదవడానికి ఆయన రెండు గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టారు. రిమాండ్ రిపోర్టు ఇప్పటికే విస్తృతంగా షేర్ అయింది.
న్యాయనిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు నేరుగా ఎక్కడా ప్రమేయం ఉన్నట్లుగా కనిపించలేదంటున్నారు. అసలు స్కాం జరిగిందని ఎలా చెబుతున్నారో ఎక్కడా లేదు. సజ్జల కూడా చెప్పలేదు. జీవో లో ఉన్నట్లుగా ఎంవోయూలో లేదని.. అదని..ఇనీ చెప్పుకొస్తున్నారు. మొత్తంగా సజ్జలకంగారు చూస్తూంటే..అసలు ఈ తప్పుడు కేసుకు మొత్తం సూత్రధారి సజ్జల రామకృష్ణారేడ్డేనేనని అందుకే ఆయన ఇంత కంగారు పడుతున్నారన్న వాదన వినిపిస్తోంది.