వైసీపీ పార్టీని , ప్రభుత్వాన్ని … అనుకూల మీడియాను చిటికెన వేలి మీద తిప్పేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డితన కుమారుడ్ని రాజకీయాల్లోకి తేవాలని అనుకుంటున్నారు.. ఇప్పటికే సోషల్ మీడియా ఇంచార్జ్ పదవి ఇప్పించిన ఆయన వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నిలబెట్టాలని అనుకుంటున్నట్లుగా వైసీపీలో ప్రచారం జరుగుతోంది. అందు కోసం పొన్నూరు నియోజవకర్గాన్ని పరిశీలిస్తున్నట్లుగా చెబుతున్నారు.
కడప జిల్లాకు చెందిన సజ్జల రామకృష్ణారెడ్డికి.. తన కుమారుడ్ని అక్కడ నిలబెట్టడం ఇష్టం లేదు. అక్కడ వైసీపీ నేతల ముందు తట్టుకోలేడని అనుకుంటున్నట్లుగా ఉన్నారు. అందుకే ఆయన గుంటూరు జిల్లాపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో వైసీసీ టిక్కెట్ రాదని ముందుగానే తేలిపోయిన నియోజకవర్గంలో కిలారి రోశయ్య ముందు ఉంటారు. ఆయనపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. దాంతో అక్కడ కొత్త అభ్యర్థి కోసం చూస్తున్నారు. అంబటి రాయుడును లైన్లోకి తెచ్చినప్పటికి ఆయన పేరు రేపల్లెకు పరిశీలిస్తున్నారు.
పొన్నూరు నుంచి సజ్జల భార్గవరెడ్డికి చాన్స్ ఇవ్వాలని జగన్ వద్ద సజ్జల ప్రతిపాదన పెట్టారని అంటున్నారు. ప్రస్తుతం అంతా సజ్జల గుప్పిట్లో ఉంది.. జగన్ రెడ్డి కాదనే పరిస్థితి ఉండదు. అందుకే.. మెల్లగా పొన్నూరులో సజ్జల భార్గవ పేరును తెరపైకి తెస్తున్నారు. లోపాయికా రీ ప్రచారాలు చేయించుకుని… తర్వాత బెడిసికొడితే అలాంటిదేమీ లేదని చెప్పడంలో సజ్జల ఎక్స్ పర్ట్ కాబట్టి…. ప్రభుత్వానికి ఆయన .. కుమారుడికి పొన్నూరు టిక్కెట్ అనే ఫీలర్ ను వదిలారు. తర్వాత పరిణామాలు వేచి చూడాల్సి ఉంది.