వైసీపీలో ఏదైనా వ్యూహాత్మకంగా జరుగుతుంది . ఇప్పటి వరకూ ఈ వ్యూహాల వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆయనపైనే వ్యూహాలు అమలవుతున్నట్లుగా తాడేపల్లి ప్యాలెస్‌లో గుసగుసలు ఎక్కువ అవుతున్నాయి. కొన్ని ప్రత్యేకమైన మీడియాల ద్వారా మొత్తం తప్పు సజ్డలదేనని సీఎం జగన్‌కు ఏమీ తెలియదన్న ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. సజ్జల జగన్మోహన్ రెడ్డిని తప్పుదోవ పట్టించి తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేశారని.. ప్రతిపక్షాలపై అఘాయిత్యాలన్నీ ఆయన డైరక్షన్లోనే జరిగాయని … జగన్ కేమీ తెలియని కొంత మంది చెప్పడం … ప్రచారం ప్రారంభించేయడం కూడా జరిగింది.
అంతా సజ్జల వల్లేనని వైసీపీలోని కొన్ని వర్గాల ప్రచారం
టీడీపీ గాలి వీస్తోందని ప్రారంభించి అసలు ఈ పరిస్థితి రావడానికి జగన్ తప్పేమీలేదని ఆయన అద్భుతమైన పాలకుడని.. కానీ పూజారి లాంటి సజ్జలే జగన్ ను జనం దగ్గరకు పోనీయలేదన్న అభిప్రాయాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయనను బలివ్వడం ద్వారా జగన్ నిజాలు తెలుసుకుంటున్నారని.. ప్రజలకు ఇక నుంచి మంచే చేస్తారన్న అభిప్రాయం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడే ఈ ప్రచారం ప్రాధమికంగా ప్రారంభమయింది. ఎలాగూ పార్టీ వీడిన ఎమ్మెల్యేలు.. సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేలు ఎక్కువగా సజ్జలనే టార్గెట్ చేస్తున్నారు.
జరిగిన తప్పులన్నంటికీ సజ్జలను బలి చేసి జగన్ స్వాతిముత్యం వేషం వేయబోతున్నారా ?
పార్టీ క్యాడర్‌కు సజ్జల రామకృష్ణారెడ్డిపై చాలా కోపం ఉంది. ఆయన జగన్ ను కలవనీయరని.. అన్నీ తనకే చెప్పుకోవాలంటారని అంటారు. అదే సమయంలో ప్రతీ వ్యవస్థపై ఆయనకే పట్టు ఉంటుంది. ఎవరైనా ఆయన మాటే వినాలి. చివరికి పార్టీ సోషల్ మీడియాను కూడా గుప్పిట్లో పెట్టుకున్నారు. ఎలా చూసినా పార్టీపై మొత్తం పట్టు ఆయనకే ఉంది. దీంతో ఆయన ప్రోత్సహిస్తున్న వారు మినహా ఇతరులు తీవ్రంగా మండిపడుతున్నారు. సగం మందికిపైగా ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల్లో ఆయనపై ఆగ్రహం ఉంది. కానీ జగన్ ఆయనపై పెట్టుకున్న నమ్మకం కారణంగా చెప్పడానికి వెనుకాడుతున్నారు.
జగన్ రాజకీయం అంతే !
ఇప్పుడు జగన్ కూడా.. ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవడానికి తాను కాదు.. అంతా సజ్జల వల్లే అని చెప్పి తప్పించుకోవడానికి ఓ అవకాశం లభించింది. దాన్ని పకడ్బందీగా ఎగ్జిక్యూట్ చేయడం ప్రారంభించారని తాజా పరిణామాలతో వైసీపీలోనే ఓ ప్రచారం.. మరో రెండు నెలల్లో సజ్జల ఎక్కడ ఉంటారో చెప్పడం కష్టమని.. ఈ లోపు ఆయన తీవ్రమైన దుర్భర పరస్థితులు ఎదుర్కొంటారని అంటున్నారు. జగన్ కు నెంబర్ టు పొజిషన్లో ఎవర్నీ ఎక్కువ కాలం ఉంచేందుకు ఆసక్తి చూపరు. మొదట వైవీ సుబ్బారెడ్డి తర్వాత ఉమ్మారెడ్డి, మైసూరారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇలావరుసగా సీరిస్ కొనసాగుతుంది. ఇప్పుడు సజ్జలను బలి చేయాల్సిన సమయం వచ్చిందని వైసీపీలోనే గట్టిగా ప్రచారం జరుగుతోంది.