వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో టీవీ చానళ్లలో ఆపార్టీ తరపున బూతుల సంప్రదాయాన్ని కొనసాగించిన వ్యక్తి రవిచంద్రారెడ్డి. సాక్షిలో రోజూ ఆయన విపక్షాలపై.. విపక్ష నేతలపై ఆయన వ్యాఖ్యలు అసహ్యం పుట్టించేలా ఉంటాయి. ఇతర మీడియాలతో మాట్లాడినప్పుడు ఇంకా ఎక్కువ రెచ్చిపోతారు ., ఇప్పుడు ఆయనను సాక్షి స్టూడియో దగ్గరకు రానివ్వొద్దని ఆదేశాలు పాస్ చేశారు. అంతే కాదు.. ప్రో మీడియా అంతటికి సందేశం పంపారు.
వైసీపీతరపున డిబేట్లకు పోటీ చేసిన వారు కాకుండా మరికొంత మందిని మాత్రమే అనుమతించాలని ఇంకెవరిని అనుమతించవద్దని ఓ లేఖ వైసీపీ ప్రో మీడియా సంస్థలకు అందింది. అందులో రవిచంద్రారెడ్డి పేరు లేదు. దీనికి కారణం ఆయన అసభ్యంగా మాట్లాడుతున్నారని కాదు.. తమనే టార్గెట్ చేస్తున్నారని సజ్జల ఫీలవడమే. ఇటీవల ఆయన వైసీపీకి పట్టిన అసలు వైరస్ సజ్జల , విజయసాయిరెడ్డేనని ఆరోపిస్తున్నారు. స్వయంగా కొమ్మినేని నిర్వహించిన షోలో ఆయన అలా మాట్లాడటంతో కొమ్మినేని వెర్రినవ్వుతో చూస్తూండిపోయాడు కానీ కట్ చేయలేకపోయాడు.
ఈ ఘటన తర్వాత ఆయనను సాక్షి మీడియాకు కానీ ఇతర మీడియాకు కానీ పిలవడంలేదు. అయితే యూట్యూబ్ చానల్స్ ఇంటర్యల్లో అదే మాటలు చెబుతున్నారు. సజ్జల ,. విజయసాయిరెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నారని.. వారి వల్లే పార్టీకి నష్టమని అంటున్నారు. అందుకే ఆయనను ఇక తమ పార్టీగా పరిగణించాలని వైసీపీ అనుకోవడం లేదు.