కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థ పరువు ఇప్పుడు.. క్లీన్ కాని గంగలో కలసిపోయింది. దానికి కారణంగా సీబీఐని రాజకీయంగా వాడుకునేందుకు తాపత్రయపడిన భారతీయ జనతా పార్టీ పెద్దల కక్కుర్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఓ కేసులో సీఎం రమేష్ ను ఇరికించడానికి దొంగ డాక్యుమెంట్లు తయారు చేసిన వైనం.. దేశం మొత్తాన్ని నివ్వెరపరిచింది. అయితే ఈ అంశానికి ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాక్షి దినపత్రిక కొత్త కవరేజీ ఇచ్చింది. అసలు సీబీఐని ఆటాడిస్తోంది.. తెలుగుదేశం పార్టీనేననట. ఇందు కోసం భారీ ప్రణాళికలు వేసిందట. సీబీఐ ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాల కోసం ప్రయత్నించిందట. సాక్షి పత్రికలో నేటి బ్యానర్ ఇదే.
రెండో పేరాలోనే ఓ మాట చెప్పారు..” ఇప్పటికిప్పుడే తెర వెనుక జరిగిన పరిణామాలు బయటకు వచ్చే అవకాశాల్లే నప్పటికీ..కాలక్రమేణా సీబీఐ కేసుల్లో కీలకంగా వ్యవహరించిన కేంద్ర మాజీ మంత్రి ఒకరు, మరో రాజ్యసభ సభ్యుని వ్యవహారం బయటకు వస్తుందని సీబీఐ వర్గాలే అంటున్నాయి..” ఇదీ రెండో పేరాలో అన్న మాట. ఇందులో సమాచారం ఏమైనా ఉందా..?. సీబీఐ వ్యవహారాలపై నోరు ఎత్తితే … భవిష్యత్ లో వదిలి పెట్టబోమని బెదిరింపులు ఉన్నాయా..? . అలోక్ వర్మ, అస్థానా లంచాల వ్యవహారంతో.. సీబీఐలో.. ఓ రకమైన టెన్షన్ వాతావరణం ఉంది. టీడీపీ ఎంపీని ఇరికించడానికి చేసిన ప్రయత్నం ఉంది. అయితే.. సీబీఐ కార్యాలయంలో టీడీపీ ఎంపీలతో.. సీబీఐ అధికారుల సంబంధాల గురించే.. చర్చ జరుగుతోందట.
ఈ కథనం మొత్తం…. సీబీఐ విషయంలో ఎలాంటి ఆరోపణలు చేయకుండా.. ఉండేలా.. బెదిరింపులతో కూడిన విజ్ఞప్తుల్ని టీడీపీ నేతలకు…సాక్షి పంపినట్లు సాధారణ పాఠకుడికి కూడా అర్థమవుతుంది. కాంగ్రెస్ సీనియర్ నేత చిదం బరం కుమారుడు కార్తీ చిదంబరం కేసు లో… చిన్న బాల నాగేశ్వర రెడ్డి అలియాస్ సీబీఎన్ రెడ్డి విషయంలో… టీడీపీ నేతల పేర్లువచ్చాయంటూ.. రాసుకొచ్చారు. ఓ ఎంపీ పేరు ఉందని.. బెదిరింపు ధోరణితో కథనంలోరాసుకొచ్చారు. పనిలో పనిగా.. కేంద్ర విజిలెన్స్ కమిషన్ కూడా టీడీపీ చేతిలోనే ఉందన్నట్లు వ్యవహరించారు.
“సీబీఐ పోస్టింగుల్లో సాధారణంగా రాజకీయ ఒత్తిడులు పెద్దగా ఉండవట”.. ఇది రాసింది సాక్షినే. సీబీఐ పోస్టుల్ని నేరుగా ప్రధానమంత్రి … గుజరాత్ నుంచి తన అస్థాన అధికారుల్ని తెచ్చి నియమించుకున్న విధానాన్ని అందరూ చూసినా… ఇక్కడ మాత్రం.. సాక్షికి రాజకీయ ఒత్తిడులు పెద్దగా ఉండవని అనిపించింది. ఇంకా కామెడీ ఏమిటంటే.. టీడీపీ ఒత్తిళ్ల వల్ల చాలా మంది అధికారులు సీబీఐలో చేరారట.. వారి వల్ల నిజాయితీ పరులైన అధికారులకు… పోస్టింగులు దక్కలేదట. అంతే కాదు… సీబీఐలో బయటపడిన వ్యవహారాలపై… మీడియాలో వచ్చిన కథనాలు కూడా.. విస్మయపరిచాయట. మొత్తానికి… సీబీఐని పులుకడిగిన ముత్యం.. దాన్ని టీడీపీ నేతలే పాడు చేశారని చెప్పుకోవడానికి సాక్షి చాలా తాపత్రయపడింది. కానీ.. మొత్తం… సాక్షి మార్క్ లోనే… నవ్వుకునేలా ఉంది.