టీడీపీ నేత పట్టాభిరామ్ తననుపోలీసులు కస్టడీలో కొట్టారని ఆరోపించారు. ఈ వార్తకు సంబంధించి ఓ ఫోటోను పాతది ప్రచురించింది ఈనాడు. దానిని తర్వాత గుర్తించి సంబంధిత ఉద్యోగులపై చర్య తీసుకుంది. వివరణ ఇచ్చింది. ఇది నైతిక విలువలు పాటించడం అంటే. కానీ సాక్షి మాత్రం ఈ తప్పు చేసిన ఈనాడును వదిలి పెట్టలేదు. తప్పు దిద్దుకున్నా పెద్ద పెద్ద మాటలతో చీల్చి చెండాడింది. అంతేనా కొమ్మినేనితో.. కొన్ని అడుగులకు మడుగులొత్తే జర్నలిస్టు సంఘాలతోనూ ఖండింప చేశారు. కానీ ఇప్పుడు రివర్స్ అయింది. అదే తప్పు సాక్షి చేసింది.
అసెంబ్లీలో జరిగిన గొడవకు సంబంధించి పాత ఫోటోనూ సాక్షి మొదటి పేజీలో ప్రచురించింది. గొడవలో టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన చేశారని చెప్పడానికని పాత ఫోటోను తీసుకొచ్చి పెట్టింది. ఆ ఫోటోలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఉన్నారు. నిజానికి ఆమె సోమవారం సభకు రాలేదు.దీంతో టీడీపీ నేతలు ఈ అంశాన్ని పట్టేసుకున్నారు. ఈనాడు చేసిన తప్పును సాక్షి చేసిందని… మరి అలాగే స్పందిస్తారా అడ్డగోలుగా సమర్థించుకు వెళ్తారా అని ప్రశ్నించడం ప్రారంభించారు.
నిజానికి సాక్షిలో ఇలాంటివి రోజూ ఉంటాయి. ఏ మాత్రం నైతిక విలువలు లేని మీడియా సాక్షి అని.. అందరికీ తెలుసు. కానీ తప్పు ఒప్పుకుని దిద్దుకున్న వారిపైనే నిందలు వేస్తారు. బరి తెగించిన మీడియా వైపు చూడరు. సాక్షి కూడా ఆ టైపే. అందుకే ఇప్పుడు పాత ఫోటోను ప్రచురించినందుకు కనీసం వివరణ కూడా ఇవ్వదని.. పైగా ఉద్దేశపూర్వకంగానే పైస్థాయిలో తెలిసే ప్రచురించి ఉంటారని.. ఆ పత్రికలో పెద్దల మనస్థత్వం.. నీతి నిజాయితీల గురించి తెలిసిన వాళ్లు అంటున్నారు.