రాజకీయాల్లో మీడియా పాత్ర ఎప్పుడూ కీలకమే. ఏ పత్రిక అయినా.. తన విధానాన్ని తాను గట్టిగా ఫాలో అవుతుంది. అలా అవుతుంది కాబట్టే.. ఆ పత్రికకు.. ప్రత్యేకమైన పాఠకులు ఉంటారు. అలాంటి ప్రత్యేకత నిలబెట్టుకోలేకపోతే… రీడర్ షిప్ కోల్పోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దీంతో .. మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తోంది. అందులో జగన్మోహన్ రెడ్డికి… సొంత మైన సాక్షి పత్రిక… అలాగే.. ప్రొ టీడీపీ పత్రికగా చెప్పుకునే… ఆంధ్రజ్యోతి… పూర్తి స్థాయిలో పెన్నులు కదిలిస్తున్నాయి.
నెగెటివ్ ప్రచారాన్నే నమ్ముకుంటున్న సాక్షి..!
జగన్మోహన్ రెడ్డికి చావో, రేవో అన్నట్లుగా మారిన ఎన్నికలకు తన వంతు సాయం చేసేందుకు సాక్షి పత్రిక చాలా ప్రయత్నం చేస్తోంది. కానీ.. ఆ పత్రికా ఎడిటోరియల్ స్టాఫ్ ఆలోచనలే పూర్తిగా నెగెటివ్ మైండ్ సెట్‌తో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి.. జనంలో ఎంతో కొంత పాజిటివ్ ఇమేజ్ తెద్దామన్న ఆలోచనలు అసుల చేయడం లేదు కానీ… టీడీపీ, చంద్రబాబుపై … బ్యాడ్ ఇమేజ్ వేయడానికి మాత్రం పేజీలుకుపేజీలు కేటాయిస్తున్నాయి. చంద్రబాబు ఫ్యాక్షన్ లీడర్ అన్నట్లుగా భారీ గ్రాఫిక్స్‌తో.. కథనం రాశారు కానీ.. దాని ఎఫెక్ట్ ఎంతో.. అంచనా వేసుకోలేకపోయారు. అదే సమయంలో.. చంద్రబాబును వ్యక్తిగతంగా కించ పరిచే వాళ్ల ఇంటర్యూలను పెద్ద ఎత్తున ప్రచురిస్తూ.. పోతున్నారు. మొదటి పేజీలో.. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును విమర్శించిన వాటికే పెద్దపీట. అంటే.. చంద్రబాబును విమర్శించడం తప్ప.. వైసీపీ ప్లస్ పాయింట్లను.. జనంలోకి పెద్దగా తీసుకెళ్లలేకపోతోంది సాక్షి.
సాక్షి పత్రిక ప్రచారం చేస్తోంది చంద్రబాబుకే..!
రాజకీయాల్లో నెగెటివ్ ప్రచారం.. ఒక్కొక్క సారి.. ప్లస్ పాయింట్ అవుతుంది. ప్రస్తుతం సాక్షి పత్రికలో.. ఇప్పుడు ఎవరి వార్తలు వస్తున్నాయి…? నిజం చెప్పాలంటే.. జగన్మోహన్ రెడ్డి, వైసీపీ వార్తలు కూడా రావడం లేదు. పూర్తిగా.. టీడీపీ అధినేత, టీడీపీ గురించి మాత్రమే వార్తలు వస్తున్నాయి. ఒక్కటి కూడా పాజిటివ్‌గా ఉండదు.. అన్నీ నెగిటవ్గానే ఉంటాయి. రాజకీయాల్లో నెగెటివ్ ప్రచారం అయినా ప్లస్ అవుతుందనే విషయం సాక్షి ఎడిటోరియల్ స్టాఫ్ మర్చిపోయారు. పైగా.. చంద్రబాబుపై ఎప్పుడూ చేసే ఆరోపణలే తప్ప.. కొత్తగా ఏమీ లేవు. ఎన్టీఆర్‌కు వెన్ను పోటు దగ్గర్నుంచి అనేక అనేక అంశాలు పేపర్లో కనిపిస్తూ ఉంటాయి. ఒక్కటీ .. పాఠకుల మీద ఇంప్రెస్ చూపించదు… కానీ సాక్షి పాఠకుల్లోనే.. చంద్రబాబు పేరు నానేలా చేస్తోంది. ఎంతగా అంటే… మొన్నటికి మొన్న… మైలవరం వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్, విశాఖలో ఆ పార్టీ ట్రేడ్ యూనియన్ నేత గౌతం రెడ్డి… సైకిల్ గుర్తుకే మీ ఓటు అని ననదించేంత ఎఫెక్ట్ చూపించింది. సాక్షి పత్రిక చదవినా.. ఇతర పత్రికలు చదివినా.. వారికి టీడీపీనే కనిపిస్తోంది. అందుకే వారి మైండ్‌పై అది అంత ప్రభావం చూపించిందిత
టీడీపీకి ఆంధ్రజ్యోతి పాజిటివ్ ప్రచారం..!
తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఆంధ్రజ్యోతి… ప్రచారం చేస్తోంది. టీడీపీని గెలిపించడం వల్ల వచ్చే ప్లస్ పాయింట్లేమిటో ప్రజలకు వివరిస్తోంది. వివిధ రంగాల నిపుణులతో… చంద్రబాబుకు అనుకూలంగా స్టేట్మెంట్లు ఇప్పిస్తోంది. అదే సమయంలో.. జగన్మోహన్ రెడ్డి మైనస్ పాయింట్లను.. ప్రభావవంతంగా ప్రజల్లో చర్చకు పెడుతోంది. అంతే కానీ.. గుడ్డిగా.. జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించాలి.. ఆయన పై ఏదో రాయాలని మాత్రం ఆవేశపడటం లేదు. ఏ రోజు కా రోజు.. ఆయన ప్రసంగాల్లో ఏదైనా వీక్ పాయింట్ దొరికితే.. దాన్ని తెరివిగా.. ప్రజల్లోకి నెగెటివ్‌గా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ విషయంలో.. ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ స్టాఫ్ మంచి క్లారిటీతో ఉందని అనుకోవచ్చు
మొత్తానికి ఈ ఎన్నికల్లో మీడియా తమ తమ విధానాలకు అనుగుణంగా.. వార్తలు ప్రచురిస్తోంది. భిన్న కోణాలు ఆవిష్కరిస్తోంది.అందులో సమర్థవంతమైన వాదనలు ఉన్నాయి. డొల్లతనం కూడా ఉంది. కానీ.. తేలిపోతోంది మాత్రం సాక్షి అని సులువుగా తెలిసిపోతోంది.