అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాటలు అసెంబ్లీలో మాట్లాడాలి. అక్కడ మాట్లాడిన వాటికే.. ఎప్పటికైనా విలువ ఉంటుంది. బయట .. ఎన్ని ఆణి ముత్యాలు చెప్పినా అదంతా రాజకీయమే. అందుకే… అసెంబ్లీకి అంత ప్రయారిటీ ఇస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో.. ఎక్కువ మంది సభ్యులు ఉంటారు. మాట్లాడేందుకు అవకాశం రాని వారు వారిలో చాలా మంది ఉండేవారు. నవ్యాంధ్రలో తక్కువ మందే ఉన్నారు. అయినా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కోసం సీనియర్లు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే.. అసెంబ్లీలో మాట్లాడితేనే..అసెంబ్లీలో తమ అభిప్రాయాలు వెల్లడిస్తేనే దానికో ప్రాధాన్యత ఉంటుంది. అందుకే.. అసెంబ్లీ పవిత్రమైనది. బయట ఎన్ని చెప్పినా… అదంతా.. పరిగణనలోకి రాదు.
కానీ రాజకీయ కారణాలతో.. అసెంబ్లీని బహిష్కరించేసిన వైసీపీకి.. ఈ ప్రాధాన్యం గురించి పెద్దగా తెలిసినట్లు లేదు. అందుకే… గవర్నర్ ప్రసంగంపై.. తన వాదనను.. బయట మీడియాల ద్వారా.. లేకపోతే.. తన సాక్షి మీడియా ద్వారా వినిపించడం ప్రారంభించింది. గవర్నర్ ప్రసంగం అనేది రాష్ట్ర కేబినెట్ ఆమోదిస్తుంది. ఆయన సొంతం కాదు. ప్రభుత్వమే రాసిస్తుంది. అందులో.. ఎలాంటి సందేహాలు లేవు. అందులో తప్పులుంటే… తప్పుపట్టాల్సింది గవర్నర్ ను కాదు.. ప్రభుత్వాన్ని. అదీ కూడా.. అసెంబ్లీలో తప్పు పట్టాలి. అప్పుడే.. ఆ తప్పు పట్టే వాదనకు.. విలువ ఉంటుంది. కానీ అసెంబ్లీకి వెళ్లకుండా.. పత్రికల్లో.. తన వాదన.. తాను రాసేసుకుంటే.. అదెలా… ప్రతిపక్ష బాధ్యతను నిర్వర్తించడం అవుతుంది…?
ప్రజా జీవితంలో ఉన్న వారు ఎవరైనా.. అసెంబ్లీకి గౌరవం ఇవ్వాలి. అది దేవాలయం లాంటిది. ఏదో ఓ కారణం చెప్పి.. అసెంబ్లీకి డుమ్మాకొట్టి.. అక్కడ చేయాల్సిన పనులు, నిర్వర్తించాల్సిన విధులు..అన్నీ అనుకూలంగా ఉన్న చోట చేస్తానంటే.. అది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే. ఈ విషయాన్ని వైసీపీ తెలుసుకోకపోతే… ప్రజాస్వామ్యం అనే వ్యవస్థలో మనుగడ సాగించడం కష్టమే…!