జగన్ రెడ్డి నిర్వాకానికి తల్లి, చెల్లిని కోర్టుకు ఈడ్చిన వైనాన్ని జనం అందరూ చర్చించుకుంటూంటే జగన్ రెడ్డి మాత్రం ఇదంతా చంద్రబాబు కుట్ర అంటున్నారు. ఆయన కోర్టుకు వెళ్లడం కూడా చంద్రబాబు కుట్రేనా అని ఓ చిన్న లాజిక్ లాగూలు తొడుక్కునే వాడికి కూడా వస్తుంది కదా అనే డౌటానుమానం మాత్రం సాక్షి వాళ్లకు రాలేదు., ఎందుకంటే పెళ్లి భోజనం తిన్న తరవాత నచ్చలేదని ఇచ్చిన గిఫ్టుల్ని వెనక్కి తీసుకుంటానని వాదించే దౌర్భాగ్యమైన మైండ్ సెట్ ఉన్న నాయకుడి నేతృత్వంలో సాక్షి నడుస్తోంది మరి.
తాము చేసే ప్రతి తప్పుడు పనికి జరిగే చెడు అంతా చంద్రబాబు ఖాతాలో వేయాల్సిందే. జగన్ రెడ్డిని ఎవరు అక్రమాస్తులు సంపాదించుకోమన్నారు.. వాటి కోసం అన్నాచెల్లెళ్లు ఎవరు పంచాయతీ పెట్టుకోమన్నారు… అప్పనంగా కొట్టేసిన సొమ్మును చెల్లికి పంచవద్దని ఎవరు చెప్పారు .. అన్నీ చంద్రబాబే చెప్పారా ?. పత్రిక ఉంది కదా అని చంద్రబాబుపై నిందలు వేయడానికి.. తమ ఇంట్లో ఆస్తుల పంచాయతీని పెట్టుకోవడానికి చంద్రబాబుకు ఏం సంబంధం?
షర్మిలకు ఆస్తులు రాసిచ్చారని ఏదో పెద్ద కథనం రాశారు. ఎవరికి చెబుతున్నారు ? ఎవరు అడిగారు ?. అసలు ఈ ఆస్తుల పంపకాలతో ఎవరికైనా సంబంధం ఉందా ?. , షర్మిల తనకు న్యాయంచేయలేదని అంటున్నారు. ఆమెకు సమాధానం చెప్పాలి చేతకాకపోతే తేల్చుకోవాలి అంతే కానీ రాజకీయంగా పక్కనోళ్ల మీద బురద చల్లేసి కుటుంబ వివాదాన్ని కూడా రాజకీయం చేసుకుంటారా ?. రేపు భార్యతో కూడా వివాదాలు వస్తే జగన్ రెడ్డి పత్రిక ఏం రాస్తుందో చెప్పాల్సిన పని లేదు. ఇంత కంటే ఘోరమైన మనస్థత్వం ఉన్న రాజకీయ నాయకుడు భారత రాజకీయ చరిత్రలో ఉండడేమో !