సాక్షి టీవీలో చాలా కాలంగా బిజినెస్ ప్రోగ్రాంకు అనలిస్ట్ గా వచ్చారు జీవీ రావు అనే అర్థిక నిపుణుడు. ఇప్పుడు ఆయనపై వైసీపీతో పాటు ప్రభుత్వం నిప్పులు చెరుగుతోంది. ఆయన వ్యక్తిగత వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఈయన ఆర్థిక నిపుణుడా అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకూ ఆయన చేసిందేమిటంటే.. ఈనాడు పేపర్ కు ఇంటర్యూ ఇవ్వడం. ఈనాడు పేపర్లో ఏపీ దివాలా అంచులో ఉందని ఇలాంటి ప్రభుత్వం మళ్లీ వస్తే మహా ప్రమాదం అని విశ్లేషించారు. ఇది ఈనాడు బ్యానర్ గా రాయడంతో వైసీపీకి, ప్రభుత్వానికి మంట బాగా తగిలింది.
వెంటనే .. ఆర్థిక వ్యవహారాలపై ముఖ్యంగా అప్పులపై ప్రెస్ మీట్లు పెట్టి అతి తెలివితేటలు ప్రదరద్శించి దువ్వూరి కృష్ణ అనే సలహాదరు ప్రెస్ మీట్ పెట్టి.. అసలు ఏపీ అప్పులు ఎక్కడ చేసిందన్నట్లుగా మాట్లాడారు. టీడీపీ కన్నా తక్కువే చేశామని కవర్ చేసుకున్నారు. ఇదంతా ఎందుకంటే జీవీ రావు చెప్పినందుకే. తర్వాత ఫ్యాక్ట్ చెక్ రంగంలోకి దిగింది. తనకు తోచినవి తాను చెప్పింది. ఇంకా సోషల్ మీడియా సైన్యాన్ని రంగంలోకి దించారు. జీవీ రావు.. వ్యక్తిగత వీడియోలు డాన్సులు చేస్తున్నవి.. నిక్కర్లు వేసుకుని ఉన్నవి వీడియోలు పెట్టి ఈయన బిజినెస్ అనలిస్టా అని కామెంట్స్ చేయడం ప్రారంభించారు.
అయితే ఆయన బిజినెస్ అనలిస్టే అని.. సాక్షిలో బిజినెస్ ప్రోగ్రాంకు పిలిచారు కదా అని వీడియోలు.. ఇతర ఫోటోలు.. టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఆర్తిక వేత్త జీవీ రవు చెప్పినది.. అందరికీ తెలిసిన విషయేమే. ఏపీ దివాలా అంచులో ఉందని.. ఆర్బీఐ ఒక్క వారం అప్పులివ్వకపోయినా ఐపీ పెట్టడం ఖాయమని కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అయినా కవర్ చేసుకునేందుకు తంటాలు పడుతూనే ఉన్నారు.