సచివాలయ ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం.. ప్రభుత్వం పట్టుదలకు పోయి తప్పు మీద తప్పు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే సమయంలో.. పేపర్ లీక్ కాలేదని సమర్థించుకోవడానికి .. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక.. కులాన్ని అడ్డుపెట్టుకుని కలాన్ని విదిలిస్తోంది. ఏపీపీఎస్సీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అయిన అనితమ్మకు మొదటి ర్యాంక్ రావడంపై… జరుగుతున్న ప్రచారాన్ని ఖండించేందుకు కులం అస్త్రాన్ని సాక్షి పత్రిక ఉపయోగించుకుంది. అయితే.. అందులోనూ.. అబద్దమే చెప్పినట్లుగా.. తేలిపోయింది. ఆమె బీసీ మహిళ అన్నట్లుగా.. ఒక బీసీ మహిళకు టాప్ ర్యాంక్ రావడాన్ని.. సహించలేక.. ఈ లీకేజీ వ్యవహారాన్ని ప్రచారం చేస్తున్నారని సాక్షి పత్రిక.. ప్రచారం ప్రారంభించారు. అయితే.. రికార్డులు మాత్రం.. ఆమె ఓసీ జనరల్ కేటగరీ అని స్పష్టంగా చెబుతున్నాయి. ఆ కేటగిరీలోనే ఆమె… ర్యాంక్ సాధించారు. ఈ విషయాన్ని సాక్షి పత్రికే.. మెరిట్ లిస్ట్ ద్వారా.. మరో ఎడిషన్లో ప్రకటించాల్సి వచ్చింది. అంటే.. అనితమ్మను.. రాజకీయం కోసం బీసీని చేశారు.. ఉద్యోగపరంగా.. రికార్డుల పరంగా.. ఓసీ మహిళగా… ఓ చోట నిజమూ చెప్పాల్సివచ్చింది.
సచివాలయ పరీక్షల్లో జనరల్ కేటగిరీలో.. ఉద్యోగాల్లో యాభై అరవై శాతం వరకూ.. ఒకే సామాజికవర్గానికి వచ్చాయని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలన్నీ బయట పడతాయనే.. మెరిట్ లిస్టును అధికారికంగా ప్రకటించడం లేదని అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మామూలుగా అయితే.. మెరిట్ లిస్టును… ఫలితాలు విడుదల చేసిన తర్వాత రోజే ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే.. మరిన్ని లీకేజీల వ్యవహారాలు .. గుట్టు రట్టు అవుతుందని.. సీక్రెట్ గానే… ఉద్యోగ నియామక పత్రాలు అందించే ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో… పరీక్ష ఎంపిక ప్రక్రియ మొత్తాన్ని సమర్థించుకునేందుకు కులాన్ని ఉపయోగించి.. కలాన్ని ప్రయోగిస్తోంది సాక్షి పత్రిక.
అనితమ్మ… ప్రధాన సామాజికవర్గానికి చెందిన వారని… అనంతపురం జిల్లాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆమె బీసీ అయితే.. కచ్చితంగా బీసీ కోటాలనే పరీక్ష రాసేవారు. కానీ జనరల్ ఓసీ కోటా ఆమె పరీక్ష రాశారంటేనే ప్రధాన సామాజికవర్గానికి చెందిన వారని ఇట్టే తెలుసుకోవచ్చు. పైగా ఆమె… గతంలో అనేక సార్లు పోటీ పరీక్షలు రాసినప్పటికీ.. దేంట్లోనూ.. కనీసం .. ఉద్యోగ సాధన దగ్గరకూ చేరలేకపోయారు. కానీ.. ఇందులో మొదటి ర్యాంక్ తెచ్చుకున్నారు. లోపాలన్నీ కప్పి పుచ్చుకోవడానికి సాక్షి పత్రిక.. కులాన్ని వాడుకుంటోంది. బీసీ కాకపోయినా… ఓ ప్రధాన సామాజికవర్గాన్ని బీసీల్లో కలిపేసి.. ఆమె బీసీ అన్నట్లుగా ప్రచారం చేసి.. కుల వివాదాలు రెచ్చగొట్టి.. పబ్బం గడుపుకోవాలని .. అధికార పార్టీ మీడియా ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.