వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో.. ప్రతి పదానికి ముందు చంద్రబాబు పేరు పలకడం కామనే. అయితే 99 శాతం అవినీతి ఆరోపణలపైనే ఆయన ప్రసంగం కొనసాగుతుంది. కానీ విజయనగరంలో మాత్రం కాస్త ట్రెండ్ మార్చారు. తన విలువల గురించి చంద్రబాబుతో పోల్చి చూసుకుని… భారీ ప్రంసగం ఇచ్చారు. అందులో చాలా బరువైన పదాలున్నాయి. ప్రత్యేకహోదా కోసం పోరాడటం వల్లే.. తన భార్యపై కేసులు వచ్చాయట..! చంద్రబాబు ప్రత్యేకహోదాను మోడీ దగ్గర తాకట్టు పెట్టడం వల్లే ఓటుకు నోటు కేసులో అరెస్ట్ కాలేదు. ఇదొక్కటే కాదు.. తన విలువల గురించి ఆయన చాలా పెద్ద లెక్చరే ఇచ్చుకున్నారు. స్వయం ప్రకటిత “విలువల సాధనాకర్త”గా తనను తాను చెప్పుకునే ప్రయత్నం చేశారు. సాక్షి మీడియా కూడా… ఏపీలో మరే వార్తకు అంతకు మించి విలువ లేదన్నట్లుగా.. దాన్నే బ్యానర్‌గా ప్రచురించింది.
బీజేపీతో కుమ్మక్కయ్యారు కాబట్టే ఓటుకి నోటు కేసులో చంద్రబాబు అరెస్టు కాలేదని జగన్ చెబుతున్నారు.. దానిలో చంద్రబాబును ఎలాగోలా బుక్ చేద్దామనే కదా… ఇప్పుడు అంతా హైడ్రామా జరుగుతోంది. తన అక్రమాస్తులన్నీ భార్య పేదు మీదకు బదలాయించి.. ఆమెకు వ్యాపారవర్గాల్లో ఓ విలువ పెంచి.. ఆమెపై కేసులు పడేలా చేసింది జగనే. కాన్ని దాన్ని ప్రత్యేకహోదా కోసం ముడి పెట్టారు. ప్రత్యేకహోదా కోసం జగన్ ఎప్పుడు పోరాటం చేశారు..? ప్రత్యేకహోదా కావాలంటే.. ఏపీ ప్రభుత్వాన్ని తిడితే.. దాన్ని చూసే… మోడీ జగన్ భార్యపై కేసులు నమోదు చేయించారా..? . ఇంకా జగన్ తన విలువలు ఎంత గొప్పవో.. చాలా దృష్టాంతాలు చెప్పుకున్నారు. అందులో ఒకటి ఎంపీలతో రాజీనామాలు చేయించడం. హోదా కోసం ఎంపీలతో రాజీనామాలు చేయించారట..! . ఆ విషయం జగన్ ఒక్కడికే తెలుసు. అందరూ.. బీజేపీపై పోరాడటం ఇష్టం లేక… రాజీనామాలు చేసి ఇంటికెళ్లిపోయారని చెప్పుకుంటున్నారు. కీలక సమయంలో రాజీనామాలు చేసి.. ఏపీకి అన్యాయం చేశారని.. జనం దృష్టిలో అభిప్రాయం ఉంది. జగన్ తన విలువల్లో భాగంగా… విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజుకు కూడా విలువల్లేని నిందేలేసేశారు.
అయినా జగన్ చెప్పే విలువలు… ఆయన ఆచరించే “విలువ” ఎలాంటిదో ఎవరికీ తెలియనిదా ఏమిటి..? అన్న సెటైర్లు.. అన్ని వైపుల నుంచి వచ్చి పడుతున్నాయి. గత మూడు నెలల కాలంలో కేవలం… కేవలం “భారీ విలువ” ఉన్న మనుషులు వచ్చారని.. నమ్మకస్తుల్ని, పార్టీకి విధేయులుగా ఉన్న 23 మంది అత్యంత అవమానకరంగా.. సమన్వయకర్తల పదవి నుంచి తొలగించడమేనా అసలు జగన్ పాటించే విలువ…?. అయినా… గాంధీ జయంతికి ముందు రోజు జగన్ విలువల గురించి ప్రసంగించి.. గాంధీ జయంతి రోజు తన పత్రిక బ్యానర్లలో వచ్చేలా చూసుకోవడంలో మాత్రం.. జగన్ చాలా పెద్ద విలువైన ప్రణాళికే వేసుకున్నారని అనిపించడం సహజమే.