భారతీయ జనతా పార్టీతో వైసీపీ తెగిపోతున్న సంబంధాల ప్రభావం… ఆ పార్టీకి చెందిన మీడియాలో ప్రస్ఫుటమవుతోంది. ఆ పార్టీ నేతల కార్యక్రమాలకు అంతంత మాత్రం స్పేస్ ఇవ్వడం ఒకటైతే.. ఎడిటోరియల్ పేజీ సాక్షిగా.. బీజేపీ విధానాలపై దాడికి దిగుతూండటంతో.. మరొకటి. వార్తల కవరేజీ.. ఇచ్చినా ఇవ్వకపోయినా.. పెద్దగా ఎవరూ పట్టించుకోరు.. బీజేపీకి కావాల్సినంత మీడియా సపోర్ట్ ఉంది. కానీ బీజేపీ విధనాలపై… ఎడిటోరియల్ పేజీలో తమకు మాత్రమే పరిమితమైన ప్రముఖులతో వరుసగా కథనాలు రాయిస్తూ.. బీజేపీపై వ్యతిరేకత పెంచే ప్రయత్నాన్ని ఓ రేంజ్లో.. సాక్షి చేస్తోంది. ప్రముఖ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్.. ఈ వారం.. బీజేపీ చరిత్రను మార్చాలనుకుంటోందని విమర్శిస్తూ.. ఓ సుదీర్ఘకమైన ఆర్టికల్ రాశారు.
ఇటీవలి కాలంలో బీజేపీ చరిత్రను తిరగాసే ప్రయత్నం చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో… అమిత్ షా ఒకటి, రెండు సందర్భాల్లో.. చరిత్రలో జరిగిన వ్యవహారాలు వేరని.. మనం అనుకుంటున్న వేరని..నిజాలు బయటకు రావాల్సి ఉందన్న అర్థంలో మాట్లాడారు. దీన్ని పట్టుకునే ఏబీకే ప్రసాద్ తో సాక్షి యాజమాన్యం.. ఆయనను విమర్శిస్తూ.. ఆర్టికల్ రాయించంది. ఇందులో ఏబీకే ప్రసాద్… లోతుగా విశ్లేషణ చేశారు. చాలా మందికి ఆ విశ్లేషణ అర్థం కాకపోవచ్చు కానీ…భారతీయ జనతా పార్టీ ఏదో తప్పు చేస్తోందన్న భావన మాత్రం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆ ఆర్టికల్ బాగా ఉపయోగపడుతుంది.
గతంలో కంచె ఐలయ్యతో.. మాత మార్పిళ్లకు అనుకూలంగా.. ఓ ఆర్టికల్ ప్రచురించి సాక్షి యాజమాన్యం.. తన ఉద్దేశం చెప్పకనే చెప్పింది. ఆరెస్సెస్ చెబుతున్నట్లుగా.. మత మార్పిళ్లు నేరం కాదని వాదించే ప్రయత్నం చేశారు. ఎడిటోరియల్ పేజీలో అభిప్రాయాలకు తమకు సంబంధం ఉండదని.. సాక్షి యాజమాన్యం చెప్పవచ్చు కానీ.. అందరి అభిప్రాయాలు అక్కడ ప్రచురించరు. తమకు ఏ అభిప్రాయాలు కావాలో.. వాటిని.. ఆస్థాన రచయితలుగా ఉన్న ప్రముఖులతో రాయించుకుని ప్రచురించడం సాక్షి నైజం. దీన్ని బీజేపీపై దాడులకు పకడ్బందీగా సాక్షి ఉపయోగించుకుంటోంది. జగన్ విధానాలను… తెరపైకి తెస్తోంది.