తెలుగుదేశం పార్టీలో ఎలాంటి కుదుపు వచ్చినా ముందుగా.. సంతోషపడేది… సాక్షి దినపత్రిక. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంతమైన ఈ పత్రిక.. అయితే జగన్మోహన్ రెడ్డి భజన.. లేకపోతే.. టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాడానికే పరిమితవుతుంది. టీడీపీకి వ్యతిరేకంగా ఏ చిన్న అంశం జరిగినా.. చిలువలు, పలువలుగా రాసి.. అధినేతను సంతృప్తి పరుస్తుంది. కానీ.. టీడీపీ నుంచి ఏకంగా నలుగురు రాజ్యసభ సభ్యులు ఫిరాయిస్తే.. ఇక టీడీపీ పని ఫినిష్ అనే రేంజ్లో ప్రచారం చేయాల్సిన సాక్షి మీడియా పూర్తిగా విఫలమయింది. పైగా చంద్రబాబు వ్యూహం అంటూ.. ఆయనకు లేనిపోని హీరోయిజం కట్టబెట్టే ప్రయత్నం చేసి… ఆయన ఇమేజ్ను పెంచే ప్రయత్నం చేస్తోంది.
టీడీపీలో సంక్షోభానికి.. సాక్షి పత్రిక పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేకపోయింది. దానికి కారణం… బీజేపీలో చేరిన నలుగురు ఎంపీలు.. చంద్రబాబునాయుడు.. అత్యంత సన్నిహితులు, వాళ్లెవరూ మనస్ఫూర్తిగా బీజేపీలో చేరడానికి అవకాశం లేదని.. సాక్షి పత్రిక గట్టిగా నమ్ముతోంది. అందుకే వాళ్లను.. చంద్రబాబునాయుడే… తెలుగుదేశం పార్టీలోకి పంపించారంటూ.. కథనాలు రాయడం ప్రారంభించారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ టీడీపీలోకి వస్తారని.. కూడా సాక్షి పత్రిక అంచనా వేస్తోంది. చంద్రబాబునాయుడుపై.. కేసులు పడకుండా ఉండటానికి.. పార్టీ ప్రయోజనాలు కాపాడుకోవడానికి.. ఇలా రకరకాలుగా… విశ్లేషించి.. చంద్రబాబే వాళ్లను.. టీడీపీలోకి పంపారని చెప్పడానికి ప్రయత్నం చేసింది.
మామలుగా అయితే.. ఇలాంటి చేరికలు ఏమైనా ఉంటే.. టీడీపీ ఫినిష్ అని సాక్షి పత్రిక ప్రచారం చేసి ఉండేది. కానీ ఈ సారి మాత్రం… ఆ ప్రయత్నం చేయడం లేదు. దీనికి వైసీపీ రాజకీయ వ్యూహం కూడా కారణమన్న ప్రచారం వినిపిస్తోంది. బీజేపీ బలపడితే.. టీడీపీ కన్నా ప్రమాదకరం అని.. ఆ పార్టీకి బాగా తెలుసని చెబుతున్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థి లేకుండా ఉండరు . వీలైనంత తక్కువ ప్రమాదకర ప్రత్యర్థిని ఎంచుకోవడమే ముఖ్యం. ఇప్పుడు.. వైసీపీ వ్యూహకర్తలు.. టీడీపీ కన్నా.. బీజేపీనే ప్రమాదకరం అని నమ్ముతున్నారు. తామే ప్రధాన ప్రత్యర్థి అయితే.. ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం.. తమను చిటికెన వేలుతో ఆడిస్తుందన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లో ఉందని.. అందుకే.. సాక్షి పెద్దగా స్పందించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.